veera asnam
veera asnam

దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడేవారికి యోగా ప్రశాంతతను చేకూరుస్తుంది. యోగా ఆసనాలలో ఎన్నెన్నో రకాలున్నాయి. వాటిలో ప్రస్తుతం మనం వీరాసనం గురింటి తెలుసుకుందాం.

కుడి మోకాలిని లేవనెత్తి కుడి పాదాన్ని నేలకు తాకించి ఎడమ మోకాలి పక్కన ఉంచవలెను. కుడి మోచేతిని కుడి మోకాలు మీద పెట్టి కుడి అరచేతితో చూబుకాన్ని పట్టుకోవలయును. కళ్ళు మూసుకుని రిలాక్స్‌గా ఉండవలెను.

వెన్నెముక తల నిటారుగా ఉంచి దేహము చలన శరీరం కదలకుండా ఉంచాలి. అదే విధంగా ఎడమ పాదం కుడి మోకాలి పక్కన ఉంచి ఇదే ప్రకారంగా తిరిగి చేయాలి. ఈ ఆసనం కుడి ఎడమలు మార్చుతూ సుమారు రెండు నిముషాల పాటు చేయవలెను.

ఉపయోగాలు..

  • శరీరాకృతి మెరుగవుతుంది.
  • జీర్ణక్రియ మెరుగుపడి అసిడిటీ సమస్య తగ్గుతుంది.
  • కాళ్ళలో రక్తప్రసరణ బాగా జరిగి కాళ్ళనొప్పులు తగ్గుతాయి.
    -మోకాళ్లు, తొడలు, మడమలు బాగా స్ట్రెచ్‌ అవుతాయి.
  • ఈ ఆసనం చేయడం వలన మనసులో సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత చోటుచేసుకోగలదు. మానసిక ప్రశాంతత ఏర్పడడంతో పరిస్థితులపై అవగాహన పెరిగి భౌతిక, మానసిక సమతుల్యత ఏర్పడగలదు. సరైన రీతిలో ఆలోచించగలము. ఎప్పడూ ఆలోచిస్తూ ఉండేవారికి ఈ ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మూత్ర పిండాలకు, కాలేయం, ఉదర భాగమునకు ప్రత్యుత్పత్తి అవయవములకు సంబంధించిన లోపాలను తొలగించి మంచిని చేకూర్చుతుంది.
  • జాగ్రత్తలు..
  • మోకాళ్ళ సర్జరీలు అయిన వారు డాక్టరు సలహాతో యోగా నిపుణుని పర్యవేక్షణలో ఈ ఆసనం సాధన చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here