siddha vydhyam

సిద్ధ యొక్క పుట్టుక

భారతదేశ వైద్యవిధానాలలో సిద్ధ అనేది ఒక అతి పురాతనమైన విధానం. ‘సిద్ధ’ అనే మాటకు అర్ధం సాధించడం మరియు ‘సిధ్ధార్లు’ అనే వారు వైద్యంలో ఫలితాలను సాధించిన సాధువులు. ఈ వైద్య విధానాన్ని అభివృధ్ది చేయడానికి 18 మంది సిధ్ధార్లు కృషి చేసినట్లు చెప్పబడుతోంది. సిద్ధకు సంబంధించిన సాహిత్యం అంతా కూడా తమిళ భాషలో ఉంది. అలాగే విదేశాలలోనూ మరియు భారతదేశంలోనూ తమిళం మాట్లాడే ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఆచరించబడుతోంది. ఈ సిధ్ధ విధానం చాలావరకూ వైద్యశాస్త్రంలో చికిత్సా విభాగానికి చెందిన స్వభావం కలది.

సిద్ధ యొక్క చరిత్ర

సృష్టికర్తచే మానవాళికి ముందుగా అందివ్వబడిన నివాసం తూర్పున ఉన్నసమశీతోష్ణ మరియు సారవంత మైన భారతదేశ ప్రాంతం. మానవజాతి ఇక్కడ నుండే తన సంస్కృతిని, జీవనోపాధికి మార్గాన్వేషణను ప్రారంభించింది. అందుచేత మానవ సంస్కృతి మరియు నాగరికతలు పుట్టి ప్రారంభమై, వ్యాప్తి చెందిన మొదటి దేశం, భారతదేశమని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత చరిత్ర ప్రకారం, ఆర్యులు వలస రావడానికి పూర్వం, భారతదేశంలో మొట్టమొదట నివసించినవారు ద్రవిడియన్లు, వారిలో అత్యంత ప్రముఖులు తమిళులు.

తమిళులు ముందుగా నాగరికత కలవారే కాకుండా, అంతకుముందున్న వారందరికంటే చెప్పుకోతగ్గ స్ధాయిలో నాగరికతను అభివృధ్ది చేసినటువంటి వారు. భారతదేశంలో భాషలు రెండు ఉన్నత వర్గాలుగా – బహుళ ప్రాధాన్యం గల అంశంగా సంస్కృతంతో ఉత్తరం వైపు భాష మరియు దక్షణం వైపు స్వతంత్ర ప్రతిపత్తి కలదిగా ద్రవిడియన్ భాష విభజించ బడ్డాయి. మానవుని యొక్క శ్రేయస్సు, సంరక్షణ మరియు అతని మనుగడ కోసం వైద్య శాస్త్రం ప్రాథమికంగా ప్రాముఖ్యతను కలిగివుంది. అందుచేత ఇది మానవ సృష్టితోనే ప్రారంభమై ఉండి, తరువాత నాగరికతగా అభవృధ్ది చెంది ఉండవచ్చు. అందుచేత, ఈ వైద్య విధానాలు ప్రారంభమైన ఖచ్చితమైన కాలాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం అంత అర్ధవంతమైనది కాకపోవచ్చు. అవి శాశ్వతమైనవి. మానవుడితో ఆరంభమైవవి, అలాగే, అతనితోనే అంతమైపోవచ్చు. ’సిద్ధ’ దక్షిణ ప్రాంతంలో వర్ధిల్లింది, ‘ఆయుర్వేదం’ ఉత్తర భారతంలో ఆచరణలో ఉంది. ఈ విధానాలకు ఆద్యులుగా ఏ ఒక్కరి పేరునైనా పేర్కొనడానికి బదులు, మన పూర్వీకులు వీటి పుట్టుకను ఆ సృష్టికర్తకే ఆపాదించారు. సాంప్రదాయాల ప్రకారం ఈ సిద్ధ జ్ఞానాన్ని శివుడు తన భార్య అయిన పార్వతికి ముందుగా వెల్లడించినట్లు, ఆమె దీనిని తిరిగి నందిదేవునికి అప్పగించింది, అతడు మరల దీనిని సిద్ధార్లకు అందజేసాడు. పురాతన కాలంలో సిద్ధార్లు అత్యంత ప్రముఖులైన శాస్త్రవేత్తలు. సాంప్రదాయాల ప్రకారం, ఈ సిద్ధ వైద్య విధానం పుట్టుక ప్రఖ్యాత సిద్ధుడైన ‘అగస్తియార్’ కు ఆపాదించబడింది. అతనిచే వ్రాయబడిన కొన్ని గ్రంథాలు వైద్య శాస్త్రంలోనూ, శస్త్ర చికిత్సలోనూ సిద్ధ వైద్య విధానాన్ని అనుసరిస్తున్న వైద్యులకు ఇప్పటికి కూడా తమ రోజువారీ వాడుకలో, ప్రామాణికాలుగా ఉన్నాయి.

సిద్ధ యొక్క ప్రధానాంశాలు

ఈ విధానం యొక్క సూత్రాలు మరియు సిధ్దాంతాలు, ప్రాథమికమైన మరియు ఆచరించబడే రెండూ కూడా, ఆయుర్వేదంతో దగ్గర సారూప్యతను కలిగి ఉంటాయి. విషపూరిత కీటకాలకు సంబంధించిన రసాయనశాస్త్రం ఒక ప్రత్యేకతగా, ఈ విధానం ప్రకారం మానవ శరీరం విశ్వానికే ఒక ప్రతిరూపం వంటిది, అలాగే వాటి పుట్టు పూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా ఆహారం, మందులు కూడా ఆయుర్వేదం మాదిరిగానే మానవశరీరంతో సహా, విశ్వంలో అన్ని వస్తువులు కూడా ఐదు ప్రాథమిక అంశాలతో అంటే భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో కూడి ఉన్నాయని ఈ సిధ్ధ విధానం కూడా నమ్ముతుంది. మానవశరీరం తీసుకునే ఆహారం, అది వాడుతూ ఉండే మందులు అన్నీకూడా ఈ ఐదు అంశాలతోనే కూడి ఉన్నాయి. ఈ మందులలో మిళితమై ఉండే ఈ అంశాల నిష్పత్తిలో, పరిమాణంలో తేడా ఉండవచ్చు. అలాగే వాటి ప్రాధాన్యత లేక మరేదైనా, కొన్ని చర్యలకు మరియు చికిత్సా ఫలితాలకు కారణమై, బాధ్యతను కలిగివుండవచ్చు.

ఔషధకోశం, మూలికా నిఘంటువు

ఈ విధానం లోహాల మరియు ఖనిజాల, ధాతువుల వినియోగాన్ని సమర్ధిస్తూ మందులపై సుసంపన్నమైన, విలువైన మరియు వినూత్నమైన ఔషధ విజ్ఞాన ఖజానాను అభివృధ్ది చేసింది. ధాతువులకు, ఔషధకోశానికి సంబంధించిన రంగంలో ఈ విధానంలో ఉండే విజ్ఞానం యొక్క లోతును గురించిన అవగాహనను, ఈ క్రింద చూపబడిన వివరణాత్మకమైన, సంక్షిప్త వివరాలతో కూడి ఉన్న మందుల వర్గీకరణ నుండి పొందవచ్చును:

‘ఉప్పు’(UPPU) అని పిలువబడే 25 రకాల, నీటిలో కరిగిపోయే కార్బనేతర రసాయన సమ్మేళనాలు (ఇనార్గనిక్ కాంపౌండ్స్) ఉన్నాయి. ఇవి వివిధ రకాలైన క్షారాలు (ఆల్కాలీస్) మరియు లవణాలు.

నీటిలో కరగని 64 రకాలైన ఖనిజ సంబంధిత మందులున్నాయి. కాని ఇవి నిప్పులో ఉంచినప్పుడు ఆవిరిబిందువులను విడుదల చేస్తాయి. ఇందులో 32 సహజమైనవి, మిగిలినవి అసహజమైనవి, అంటే తయారుచేయబడినవి.

నీటిలో కరగని 7 రకాలైన మందులున్నాయి. కాని ఇవి వేడిచేసినప్పుడు ఆవిరి బిందువులను విడుదల చేస్తాయి.

ఈ విధానం వివిధ రకాలైన లోహాలను మరియు లోహ మిశ్రమాలను విడిగా వర్గీకరించింది. ఇవి వేడి చేసినప్పుడు కరుగుతాయి, అలాగే చల్లార్చినప్పుడు గట్టిపడతాయి. ఇవి బంగారం, వెండి, రాగి, తగరం, సీసం మరియు ఇనుము వంటివి. ఇవి ఒక ప్రత్యేక ప్రక్రియలో బూడిదగా భస్మం చేయబడి మందులలో వాడబడతాయి.

వేడిచేసినపుడు ఉత్పాతనాన్ని (సబ్లిమేషన్) చూపే, పాదరసం వివిధ రకాలైన పాదరసం యొక్క ఎరుపు సల్ఫైడ్, మెర్కురిక్ క్లోరైడ్ మరియు మెర్క్యురీ యొక్క రెడాక్సైడ్ మొదలైన రూపాలుండే మందుల సమూహం ఒకటి ఉంది.

నీటిలో కరగని గంధకం చికిత్సకు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, పాదరసంతో పాటుగా, సిద్ధ ఔషధ పదకోశంలో (నిఘంటువు) ఒక కీలకమైన స్ధానాన్ని కలిగివుంది.

ఈ విధానం చికిత్స కోసం సృష్టించిన వివరణాత్మకమైన విజ్ఞానం మరియు ఖనిజాల అధ్యయనాన్ని గురించి పైన ఇవ్వబడిన వర్గీకరణం చూపిస్తుంది. వీటికై అదనంగా జంతువులనుండి పొందే మందులున్నాయి. సాధారణ వ్యాధుల మరియు జబ్బుల చికిత్స కోసం చేసే సిద్ధ చికిత్సపై ఈ విధానం ఒక చిరు పుస్తకాన్ని ప్రచురించింది.

సిద్ధలో రసాయన శాస్త్రం

సిద్ధ విధానంలో రసాయన శాస్త్రం వైద్యానికి మరియు ఆల్కెమీకి (అతి తక్కువ లోహాలను బంగారంగా మార్చే మధ్య యుగంలో బహుళ ప్రచారంలో ఉన్న) ఒక రసాయనిక ప్రక్రియ. అనుబంధంగా ఉండే ఒక శాస్త్రంగా అభివృధ్ది చేయబడినట్లు కనుగొనబడింది. మందులను తయారు చేయడంలోనూ, అలాగే మౌలిక లోహాలను బంగారానికి రూపాంతరంగా మార్చడానికి కూడా చాలా ఉపయోగకారిగా కనిపెట్టబడింది. మొక్కలకు మరియు ఖనిజాలకు సంబంధించిన విజ్ఞానం అత్యున్నత స్ధాయిలో ఉండి, అవి విజ్ఞాన శాస్త్రంలో అన్ని శాఖలతోనూ పూర్తి పరిచయాన్ని కలిగి ఉన్నాయి. సిధ్దార్లు అనేక ప్రక్రియలలోకి విభజించబడిన అల్కెమీకు సంబంధించిన అనేక చర్యలు – భస్మీకరణం (క్యాల్సినేషన్), ఉత్పాతనం (సబ్లిమేషన్), బట్టీపట్టడం (డిస్టిలేషన్), కరిగించడం, వేరుచేయడం, విడగొట్టడం, సంయోగం లేక ఐక్యం చేయడం, ఘనీభవించడం, సైబేషన్, పులియబెట్టడం, ఎక్జాల్టేషన్ అంటే బంగారానికి మెరుగుపెట్టే ఒక చర్య లేక ప్రక్రియ, ఫిక్జేషన్ అంటే ఒకదానినుండి మరొక దానిలోకి త్వరగా మార్చలేనటువంటి స్ధితికి తీసుకురావడం, అంటే అగ్ని వల్ల సంభవించే చర్యను నిరోధించలేని స్ధితికి తీసుకురావడం, శుభ్రం చేయడం లేక శుధ్ది చేయడం, లోహాలను భస్మీకరణం చేయడం, ద్రవీకరణం అంటే ద్రవరూపంలోకీ మార్చడం, సంగ్రహించడం (ఎక్స్ ట్రాక్షన్) ఇలా ఎన్నో చర్యలలో వారికి అవగాహన ఉంది. చివరికి అరబ్బులచే కనిపెట్టబడిందని చెప్పబడుతున్నటువంటి అల్కెమీలో ఒక తప్పనిసరి ప్రక్రియ అయిన బంగారాన్ని, వెండిని మూసపోయడం సిధ్దార్లకు అంతకు పూర్వం నుండే తెలుసు.

వీరు బహువిధాల మందులను తయారుచేసే వారై ఉండి, మరగకాయడం, కరగించడం, రసాయనిక పదార్ధాలను ద్రవీకరించడం, ఘనీభవించడం వంటి పనులను కూడా చేస్తూ ఉండేవారు. వీరి కొన్ని రహస్య పధ్దతులు, ముఖ్యంగా అగ్నినుండి సంభవించే చర్యను నిరోధించే, అతి త్వరగా భగ్గుమని మండే స్వభావం గల కొన్ని పదార్ధాలను అంటే పాదరసం, గంధకం, సింధూరం, ఎర్రని సింధూరపు రంగు, (విషపూరితమైన తెల్లటి) పాషాణం మొదలైనవి, అశక్తులుగా, నిర్వీర్యంగా చేయడం, అదుపు చేయడం, గట్టిపరచడం వంటివి ఇప్పటికి కూడా అద్భుతమైన మర్మాలుగా, రహస్యాలుగానే నిలిచిపోయాయి.

సిద్ధ యొక్క బలం

అత్యవసర కేసులను తప్ప, అన్ని రకాల వ్యాధులను సిద్ధ వైద్య విధానం నయం చేయగలదు. మామూలుగా అన్ని రకాలైన చర్మ సంబంధిత సమస్యలను, ముఖ్యంగా సోరియాసిస్, ఎస్.టి.డి. (లైంగికపరంగా సంక్రమించిన వ్యాధి), మూత్రద్వారంలో అంటురోగాలు, కాలేయం వ్యాధులు మరియు పేగులకు, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు, సాధారణ నిస్సత్తువ, దుర్భలత్వం, ప్రసవానంతర రక్తహీనత, విరేచనాలు, సాధారాణ జ్వరాలు, కీళ్లవ్యాదులు మరియు (శరీర తత్వానికి సంబంధించిన) విపరీత అనారోగ్యం వంటి వాటికి చికిత్స చేయడంలో సిద్ధ వైద్య విధానం శ్రేష్టమైనది.

సిద్ధ విధానంలో రోగ నిర్ధారణ, చికిత్స

రోగ నిర్ధారణ చేయడం దాని కారణాలను గుర్తించడంతో ప్రమేయం కలిగి ఉంటుంది. అనారోగ్యానికి కారణభూత మయ్యే అంశాలు నాడి, మూత్రం, కళ్లు, మాట్లాడే విధానం, శరీరం రంగును, నాలుకను మరియు జీర్ణక్రియా విధానం యొక్క ప్రస్తుత స్ధితి వంటి వాటిని పరిక్షించి చూడడం ద్వారా కనిపెట్టడం జరుగుతుంది. ఈ విధానంలో ఒక పధ్దతి ప్రకారం, మూత్ర పరీక్ష, దాని రంగు, వాసన, చిక్కదనం, పరిమాణం మరియు నూనె చుక్కలు విస్తరించే విధానం వంటి వాటిని అధ్యయనం చేసే వివరణాత్మకమైన పధ్దతిలో ఉంటుంది. రోగ నిర్ధారణలో దీని సంపూర్ణమైన విధానం వ్యక్తిని పూర్తిగా అతనికున్న వ్యాధిని అధ్యయనం చేయడంతో కూడి ఉంటుంది.

సిధ్ధ వైద్య విధానం వైద్య చికిత్స కేవలం వ్యాధులవైపే గురిపెట్టి వుండడమే కాకుండా, రోగి, వాతావరణం, పరిసరాలను పరిగణనలోకి తీసుకోవడం, వయసు, లింగం, జాతి, అలవాట్లు, మానసిక పరిస్ధితి, నివాసం, ఆహారం, ఆకలి, శారీరక పరిస్ధితి, శారీరక నిర్మాణం మొదలైన వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలని వక్కాణించి చెబుతుంది. అంటే దీని అర్ధం చికిత్స ప్రత్యేక శ్రధ్ధతో వ్యక్తిగతమైన విషయంగా పరిగణింపబడాలని. ఇది రోగనిర్ధారణలోనూ లేక చికిత్సలోనూ పొరపాట్లు అతి తక్కువ, కనీస స్ధాయిలో ఉండేటట్లు చేస్తుంది.

సిద్ధ విధానం స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను కూడా పరిశీలించి, చికిత్స చేస్తుంది. సిధ్ధ విధానానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలలో మేలైన జీవనాన్ని గడపడానికి సమస్యలను ఎదుర్కోగలిగే సూత్రీకరణలు, పొందికగా తయారుచేసిన పధ్దతులు ఎన్నో ఉన్నాయి, స్త్రీల ఆరోగ్యంపై శ్రధ్ద ఆడపిల్లకు పుట్టిన మొదటి రోజునుండే ప్రారంభమవుతుంది. బిడ్డ పెరుగుదలకు పుట్టిన మొదటి మూడునెలల వరకూ తల్లిపాలు ఇవ్వడాన్ని సిధ్ధ విధానం గట్టిగా సమర్ధిస్తుంది. ఆహారాన్నే ఒక మందుగా భావించే సూత్రాన్ని సిద్ధ విధానం నమ్ముతుంది. అలాగే పోషకాలకు సంబంధించిన లోపాలేమైనా వారికి గాని లేక బిడ్డకు గాని కలిగితే నివారించడానికి వీలుగా పసిబిడ్డలను సాకుతూ, పాలిచ్చే తల్లులు ఇనుము, పోషకాలు మరియు పీచు అధికంగా, సమృధ్దిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సలహానిస్తుంది. రక్తలేమి సమస్యలేవీ రాకుండా ఉండడానికి 15 రోజులకొకసారి పొట్టలో పురుగులు నశించిపోవడానికి తల్లులు కాస్త అటు, ఇటూ తిరుగుతూ ఉండే చిన్న, తేలికైన వ్యాయామం వంటి ఆభ్యాసం, చర్యలు చేపట్టాలి.

అంటువ్యాధుల వల్ల లేక మరే ఇతర కారణాలవల్లనైనా సంభవించిన వ్యాధులకు, రోగిని పరీక్షించిన మీదట చేసే చికిత్స వ్యక్తికి వేరేలాగ ఉంటుంది. ఒకసారి ఆడపిల్ల రజస్వల అయిందంటే, ఆమెలో పునరుత్పత్తికి బలాన్ని మరియు భవిష్యత్తులో ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డను కనడానికి సిధ్ధ విధానం వివిధ రకాలైన తయారీలను కలిగివుంది. అలాగే, ముట్లుడిగిపోయే లక్షణం (సిండ్రోమ్) పై శ్రధ్ధను, జాగ్రత్తను తీసుకోవడానికి, ముఖ్యంగా హార్మోన్ల (ఒక అవయములో గానీ, గ్రంథిలో గాని ఉత్పత్తి అయ్యే రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతూ, ఆయా అవయములు చక్కగా పని చేయటకు దోహదపడే రసాయనిక పదార్ధం) లో సమతుల్యం లోపించినప్పుడు చేపట్టడానికి సమర్ధవంతమైన చికిత్సలు కూడా ఉన్నాయి.

సిధ్ధ విధానం కాలేయం, చర్మ వ్యాధులు, ముఖ్యంగా సోరియాసిస్, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స చేయడంలో, కీళ్ల సమస్యలు, రక్తలేమి, ప్రోస్టేట్ గ్రంధి విస్తరించిపోవడం, రక్తస్రావంతో ఉండే మూలవ్యాధి మరియు కడుపులో పుండు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సమర్ధవంతమైన చికిత్సను అందిస్తుంది. పాదరసం, వెండి, పాషాణం (విష పూరితమైన తెల్లని పదార్ధం), సీసం మరియు గంధకం వాటితో మిళితమై ఉండే సిద్ధ వైద్య విధానం లైంగిక పరమైన వ్యాధులతో సహా కొన్ని అంటువ్యాధులకు కూడా చికిత్స చేయడంలో సమర్ధవంతమైనదని కనిపెట్టబడింది. హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వ్యాధులున్న రోగులలో బయటపడుతూ ఉండే అత్యంత నిర్వీర్యపరిచే అశక్తత, దుర్భలులుగా చేసే సమస్యలను తగ్గించి, పరిష్కరించడంలో సిద్ధ విధానం సమర్ధవంతమైనదని వైద్యులు పేర్కొన్నారు. ఈ మందుల సమర్ధత పనితనంలోనూ మరింత పరిశోధన చేపట్టబడి ప్రస్తుతం పురోగతిలో ఉంది.

జాతీయ సిద్ధ సంస్ధ, చెన్నయ్ (ఎన్.ఐ.ఎస్)

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ విభాగం, భారత ప్రభుత్వం వారి నియంత్రణలో పనిచేస్తూ ఉండే జాతీయ సిద్ధ సంస్ధ, చెన్నయ్ (ఎన్.ఐ.ఎస్) ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్ధ. 14.78 ఎకరాల విస్తీర్ణం గల స్ధలంలో ఇది నిర్మించబడింది. సొసైటీస్ చట్టం క్రింద ఈ సంస్ధ నమోదు చేయబడింది. సిధ్ధ విద్యార్ధులకు ఈ సంస్ధ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్ధాయిలో కోర్సులను నిర్వహిస్తోంది, దీని ద్వారా వైద్య సంరక్షణను కలుగ జేస్తుంది. వివిధ అంశాలపై పరిశోధనలను సాగిస్తూ, ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అభివృధ్ది పరుస్తూ, ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తుంది కూడా. సిధ్ధ అంటే జనసందోహానికి మరియు వివిధ జీవనరీతులనను అనుసరిస్తూ ఉండే ప్రజానీకం వద్దకు తీసుకువెళుతూ ఉండడమే కాకుండా, తమిళ వైద్యాన్ని పరిశోధనా కార్యకలాపాలను కూడా ప్రోత్సహించేటటువంటి ఒక ప్రముఖ స్ధానంలో ఉన్న సంస్ధ కూడా. భారత ప్రభుత్వంచే తమిళనాడు ప్రభుత్వంతో కలిపి ఇది ఒక సంయుక్త, ఉమ్మడి వ్యవస్ధగా స్ధాపించిబడింది. భారత ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వం దీని మూలధన వ్యయాన్ని ఉమ్మడిగా 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. అలాగే మరల మరల చేయవలసి వస్తూ వుండే ఖర్చును (రికరింగ్ ఎక్స్ పెండిచర్) 75:25 నిష్పత్తిలో ఇవి రెండూ భరిస్తాయి. 03.09.2005 నాడు గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ గారిచే ఈ సంస్ధ మన జాతికి అంకితం చేయబడింది.

ప్రతి సంవత్సరం ఈ సంస్ధలో 46 మంది విద్యార్ధులను చేర్చుకొని, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్.డి (సిద్ధ) కోర్సులో, అంటే మరుతువం (జనరల్ మెడిసిన్), గుణపాదం (ఔషధ నిజ్ఞానం), సిరప్పు మరుతువం (ప్రత్యేక వైద్యం), కుళందాయి మరుతువం (శిశు వైద్యం), నోయి నాడాల్ (సిధ్ధ రోగలక్షణ, నిర్ధారణ శాస్త్రం) మరియు నంజు నూళం మరుతువ నీతి నూళం (విష సంభంధిత శాస్త్రం మరియు వైద్య సంబంధిత న్యాయ/ ధర్మ శాస్త్రం) అనే 6 శాఖలలో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు. ఈ సంస్ధ తమిళనాడు డాక్టర్. ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం, చెన్నైచే సిద్ధలో పరిశోధనలు చేసేవారికి పి.హెచ్.డి. పట్టాను ప్రదానం చేసే కేంద్రంగా అనుమతింపబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here