Padahastasanam
Padahastasanam

వయస్సు మళ్లడం సహజం పరిణామం. కొన్ని యోగాసనాల ద్వారా వయస్సు మళ్లడాన్ని పూర్తిగా ఆపకున్నా, యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది. అది కూడా చాలా సులభంగా. మూలాసాన, ఉత్కటాసన, పుర్వోత్తనాసన, చతురంగాసన… ఈ నాలుగు ఆసనాలతో యవ్వనంగా కనిపించవచ్చు. ఇవి చేయడం చాలా సులభమే..

యోగా మ్యాట్ పైన నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడంగా చేస్తూ సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం మూడు అడుగులు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోజిషన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాళ్ళను దగ్గరకు వంచి మీ కోర్ భాగాన్ని కిందకు దించాలి. స్లోగా వీలైనంత కిందకు దించాలి. ఇలా మూడు నాలుగు సెకండ్లు ఉంచి తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సార్లు చేయాలి.


అలాగే ఉత్కటాసన.. ఇది శరీరంలోని వివిధ సాగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పిరుదల భాగంలో ఏజ్‌తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగ మ్యాట్ పైన నిటారుగా నిలబడాలి. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురావాలి. చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళ దగ్గర వంచి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సెకండ్లు చేయాలి.


మూడవది పుర్వోత్తనాసన.. ఈ ఆసనం నిటారుగా నిలవడానికి దోహదపడుతుంది. యోగా మ్యాట్ పైన కాళ్ళను విస్తార పరుస్తూ కూర్చోవాలి. రెండు కాళ్లను దగ్గరగా ఉంచుకోవాలి. అరచేతులను మీ పక్కన నేలపై పెట్టాలి. ఇప్పుడు మెల్లగా మీ మధ్య భాగాన్ని పైకెత్తాలి. మీ బరువెంతా మీ చేతులు, హీల్స్ పైన పడేలా శరీరాన్ని ఒక లైన్లో తీసుకోవాలి. ఇలా నాలుగు ఐదు సెకండ్లు ఉంచి రెండు మూడుసార్లు చేయాలి.


నాలగవది చతురంగాసన..ఈ ఆసనం శరీరంలో జారిపోతున్న పటుత్వాన్ని తిరిగి నింపుతుంది. ఒక రకంగా ఇది ప్లాంక్ లాంటిదిగా చెప్పుకోవచ్చు. కానీ కొంచెం నిదానంగా శ్వాశను గమనిస్తూ చేస్తే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బోర్లా పడుకుని అరచేతులపై బలం చూపిస్తూ శరీరాన్ని నేల పైనుంచి పైకి లేపాలి. పాదాల చివరల్ని నేలపై ఉంచుతూ శరీరాన్ని ఒక లైన్లో ఉంచుతూ శ్వాసను బిగపట్టి బరువు ఉన్నంత వరకు పొట్టపై తీసుకోవాలి. ఇలా మూడు నాలుగు సెకండ్లు చేయాలి. ఇలా చేస్తే నిత్య యవ్వనస్తులుగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here