పిల్లర్ 1 – Pillar 1
డైట్ మొదలు పెట్టిన ఫస్ట్ 10 రోజులు ఏ విధమైన విచలనం/ మార్పులు / చేర్పులు లేకుండా 70-100g FAT (నెయ్యి / కొబ్బరి నూనె (No Virgin పేరు ఉండే నూనె) / ఆలివ్ నూనె / వెన్న/ పెరుగు మీద మీగడ / Butter (Heritage or Amul) ను తీసుకోవాలి
చీజ్ కొవ్వు వస్తువులలో భాగంగా పరిగణించబడదు. ఏమైనప్పటికీ చీజ్ కూర లలో భాగంగా ఉపయోగించవచ్చు.
10 రోజుల తరువాత, అంటే పదకొండవ రోజు నుంచి 50-70g ఫాట్ తీసుకోవాలి.. ఈ FAT వ్యక్తిగత శరీరం నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు 40 గ్రామ్స్ నుండి మొదలు పెట్టండి … అప్పుడు నీరసం అనిపిస్తే ఇంకో 10 గ్రామ్స్ ఎక్కువ తీసుకోండి. 10 గ్రామ్స్ ఎక్కువ తీసుకున్న కూడా నీరసం అనిపిస్తే మరో 10 గ్రామ్స్ ఎక్కువ చెయ్యండి
కూరలు వండే ఫాట్ పైన చెప్పిన 70-100 గ్రామ్స్ లో కౌంట్ అవ్వదు. కాక పొతే మీరు 70/50 గ్రామ్స్ డైరెక్ట్‌గ వేడి నీళ్లలో కానీ సూప్ లో కానీ కలుపు కొని డైరెక్ట్‌గా తీసుకోవాలి… మిగతా 30/20 గ్రామ్స్ కూరలు వండుకునే తప్పుడు వాడు కోవచ్చు.
పిల్లర్ 2 – Pillar 2
ప్రతి వ్యక్తి తప్పకుండా రోజు కి 3 నిమ్మకాయలు తీసుకోవాలి. సూప్ లో కానీ , వేడి నీళ్లలో కానీ , రెండు స్పూన్స్ పెరుగు లో ఒక లీటర్ నీళ్లు కలిపి చేసిన మజ్జిగ లో కానీ ఈ మూడు నిమ్మకాయలు తీసుకోవచ్చు.
పిల్లర్ 3 – Pillar 3
రోజు కి తప్పకుండ, ఏ మాత్రం పొల్లు పోకుండా 4 లీటర్లు మంచి నీళ్లు త్రాగాలి. పైన చెప్పిన విధంగ చేసుకున్న’ మజ్జిగ కూడా ఈ నాలుగు లీటర్లు క్వాంటిటీ లెక్కలో కి వస్తుంది… కానీ కాఫీ, సూప్ లాంటి వాడకం ఈ నాలుగు లీటర్లు లెక్కలో రాదు ..అయితే వేసవి కాలంలో, ఒక అదనపు 1 ltr ఎక్కువ గా తీసుకోవాల్సి వస్తుంది.
పిల్లర్ 4 – Pillar 4
రోజుకి 1 మల్టీ విటమిన్ టాబ్లెట్ (గుళిక /capsule రూపంలో మాత్రమే) తీసుకోవాలి…
“OMEGA3 FISH OIL” టాబ్లెట్స్ రోజుకి రెండు కానీ ఒకటి కానీ వేసుకోవాలి. ఈ టాబ్లెట్ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ( రెండు తీసుకునే వాళ్ళు) , మద్యాహ్నం ఒకటి ( ఒకటి తీసుకునే వాళ్ళు) తీసుకోవాలి… వారానికి మూడు సార్లు ఫిష్ కానీ , రోజు [Flax / అవిశె గింజలు తీసుకోని వాళ్ళు రోజుకి రెండు టాబ్లెట్స్ చొప్పున మరియు వారానికి 3 సార్లు ఫిష్ కర్రీ కానీ రోజు వంటల్లో 4 చెంచాలు తీసుకునే వాళ్ళు రోజుకి ఒక టాబ్లెట్ చొప్పున తీసుకోవాలి.
ఉప్పు-
కల్లు ఉప్పు / క్రిస్టల్ ఉప్పు రూపం మాత్రమే (సముద్రపు ఉప్పు) వాడాలి.
రాక్ సాల్ట్, సైంధవ లావనం, క్రిస్టల్ ఉప్పు (ఐయోడైజ్డీ) మొదలైన వాటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్యాకెట్లో లభించే కల్లూ ఉప్పూ ఐయోడ్ చేయబడినది, అనగా రసాయనాలతో ప్రాసెస్ చేయబడుతుంది.
సముద్రపు ఉప్పు …
ఐయోడైస్ట్ క్రిస్టల్ ఉప్పు NO / ప్రాసెస్ చెయ్యని ఉప్పు YES
రాక్ ఉప్పు లేదా హిమాలయన్ గులాబీ ఉప్పు NO సైంధవ లవణం NO
కిస్టల్ ఉప్పు / కలుప్పు NO
మీరు కావలసినంత పరిమాణం లో కూరలు చేసుకొని తినవచ్చును. పచ్చి కూరలు తినవలసిన అవసరం లేదు. మీరుచి ప్రకారం మీరు ఆస్వాదించే విధంగా, కూర చేసుకొని తినండి.
ఆకు కూరలు వీరివి గా కూరల్లో వేసుకొని తినండి . నాన్-వెజ్ ఆహరం తినే వాళ్ళు కూడా మొదట వెజ్ కూరలు తిన్నాకనే నాన్-వెజ్ కూరలు తినాలి. ఎందుకంటే నాన్-వెజ్ కూరల్లో పీచు పదార్ధం తక్కువ ఉంటుంది కాబట్టి మొదట వెజ్ కూరలు తిన్నాకనే నాన్-వెజ్ కూరలు తినాలి.
కూరలు పైన చెప్పిన ఫాట్ నూనెల తోనే వండు కోవాలి. రిఫైన్డ్ నూనె పనికి రాదు
చేమ దుంప, కంద, పెండలం, చిలగడ దుంప, బీట్రూట్ , పచ్చి అరటి కాయ, బీన్స్, చిక్కుడు కాయలు, బఠాణి, బంగాళ దుంప మొదలగు కూరలు ఈ డైట్ ప్రోగ్రాం లో పనికి రావు… అందువలన ఈ కూరలని డైట్ ప్రోగ్రాం అయ్యేంత వరకు నిషేధించాలి
క్రింద చెప్పిన కూరగాయలు రోజుకు ఒక్కటి మాత్రమే వాడు కోవాలి
టమోటా – 1, ఉల్లిపాయ – 1, క్యారెట్- 1
Important :
అన్ని రకాల పప్పులు / ధాన్యాలు పూర్తిగా నిషేధించినందున, ” పోపు/ తాలింపులో” మినప్పప్పు, కంది పప్పు, శనగ పప్పు లాంటివి వాడ కూడదు ‘
చింతపండును ఉపయోగించవద్దు. మీరు చింతపండు కి ప్రత్యామ్నాయంగా నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దబ్బ కాయ, ఉసిరి కాయ , నారింజ, బత్తాయి లాంటి పండ్లు “నిమ్మ” జాతి లోకే వచ్చిన అవి వాడకూడదు
బియ్యము , రొట్టెలు, గోధుమలు, మరియు వీటి తో తయారు చేసే పిండి వస్తువులు , చిరు ధాన్యాలు, మిల్లెట్స్, కొర్రలు, రాగులు లాంటి వస్తువులు ఈ డైట్ ప్రోగ్రాం లో పనికి రావు .. అందు వలన ఈ వస్తువులు నిషేధించాలి.
మరి కొన్ని Important పాయింట్స్
కొబ్బరి నీళ్లు తాగ కూడదు. రోజుకి బాగా ముదిరిన కొబ్బరి కాయ లో సగ భాగం, లేదంటే ఎండు కొబ్బరి కురిడి సగ భాగం తినవచ్చును.
పాలు మరియు పాల పదార్థాలు వాడ రాదు… పాల పొడి లాంటి వి కూడా నిషేధం పెరుగు, స్వీట్ లస్సి లాంటివి కూడా నిషేధం.
కాఫీ, టీ కావాలంటే తీసుకోవచ్చు కానీ పాలు , పంచదార లేకుండా మాత్ర మే తీసుకోవాలి … కావాలంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, గ్రీన్ టీ లాంటివి పాలు, పంచదార లేకుండా తీసుకోవచ్చు.
బిస్లరీ సోడా కావాలంటే తాగొచ్చు…కానీ ఉప్పు లేకుండా తీసుకోవాలి… కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్స్, ఐస్ క్రీమ్స్ ఇతరత్రా వస్తువులు తీసుకో కూడదు
పొగ తాగుట, మద్యం సేవించుట కూడా పూర్తిగా నిషేధము
ఇంగువ – వాడ కూడదు
బాదాం పప్పు -10 , అక్రుట్ -15 పిస్తా పప్పులు -10 రోజు తీసు కోవచ్చును.. బాదాం , అక్రుట్ నీళ్లలో నాన పెట్టి మాత్రమే తినాలి…
గుమ్మడి కాయ గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, పుచ్చు కాయ గింజలు, అవిశె గింజలు కూరల్లో వాడుకోవచ్చును… తెల్ల నువ్వులు వాడుకోవచ్చును….
గమనిక : షుగర్ కోసం డైట్ చేసే వాళ్ళు “పిస్తా” పప్పులు / నట్స్ వాడకూడదు
చాల చాల Important పాయింట్స్ :
డైట్ చేస్తున్నప్పుడు ఆకలి వేసినప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి….. ఆకలి తీరేంతమటుకే తినాలి… రుచిగా ఉందని ఆహరం తినకూడదు … మళ్ళా ఆకలి వేసే దాకా ఏమి మధ్య మధ్యలో తినకూడదు… ఒక్క బాదాం పప్పు మధ్యలో తిన్న కూడా అది వన్ మీల్ లాగ లెక్కలో కి వస్తుంది…
ఒక మీల్ డైట్ : పైన చెప్పిన విధంగ రోజుకి ఒక్కసారి మాత్రమే ఆహరం తీసుకోవాలి… తినాలన్న పదార్ధములు అన్ని ( బాదాం, పిస్తా వంటివి, ఆమ్లెట్, నాన్-వెజ్ కూరలు , వెజ్ కూరలు ఏమైనా కూడా అన్ని రోజుకి ఒక్కసారి మాత్రమే తినాలి)
రెండు మీల్ డైట్ : రోజుకి రెండు సార్లు మాత్రమే ఆహరం తీసుకోవాలి… మధ్య మధ్యలో ఎదో ఒక్క బాదాం పప్పే కదా అని తినకూడదు… చాల స్ట్రిక్ట్ గా చెయ్యాలి… సెల్ఫ్ చీటింగ్ పూర్తిగా నిషేధం
త్రి మీల్ డైట్ : ఈడైట్ ప్రత్యేకంగా “బరువు” పెరగాలి అనుకునే వాళ్ళకి సంబంధించిన డైట్… ఈ డైట్ చెయ్యాలనుకున్న వాళ్ళు రోజు కి 120 నుంచి 150 గ్రామ్స్ ఫ్యాట్ తీసుకోవాలి. మరియు రోజుకి మూడు సార్లు లేదా 4 సార్లు ఆకలి అనిపించినా డైట్ లో చెప్పిన ప్రకారం ఆహారం తీసుకోవచ్చు… ఈ విధముగా చెయ్యటం వాళ్ళ బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది…
ఆహరం తీసుకోవటానికి నిర్ధారించిన సమయం అంటూ ఏమి లేదు.. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే తినాలి… అర్థ రాత్రి రెండు గంటలకియినా సరే
ఏ విధమైన పండ్లు తిన కూడదు… అవకార్డో, జామ కాయలు కూడా నిపేధం.. …
దేవుడి ప్రసాదం, కొబ్బరి నీళ్లు, తిరుపతి లడ్డు, సత్యనారాయణ స్వామి ప్రసాదం, పంచామృతం లాంటివి అన్ని నిషేధం.
షుగర్ వ్యాధి వున్నవాళ్లు షుగర్ టాట్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ డైట్ మొదలు పెట్టిన రోజు నుంచి పూర్తిగా మానెయ్యాలి ….మిగతా హెల్త్ ప్రోట్లెంస్ ఉన్నవాళ్లు ఇంగ్లీష్ మందులు మాత్రమే వాడుకోవాలి… ఆయుర్వేదం, హోమియో’మందులు పూర్తిగా నిషేధం
నాన్- వెజ్ ఆహరం తీసుకునే వాళ్ళు రోజుకి 250 గ్రామ్స్ తీసుకోవచ్చును…. రోజుకి 0 నుండి 6 కోడి గుడ్లు తినవచ్చును… అలాగే అని… compulsary గా తినాలి అని రూల్ ఏమి లేదు….
BP: BP మందులు వేసుకుంటూ రెండు వారాలు డైట్ చెయ్యండి.. పదిహేనవ రోజు మందులు ఆపేసి పదహారవ రోజు డాక్టర్ని కలిసి ఆయన సలహా మేరకు డోన్ తగ్గించటమో లేదా పూర్తిగా మానెయ్యటమో చెయ్య వలెను. డాక్టర్ వద్దు అంటే మళ్ళా రెండు వారాలు మందులు తీసుకుంటూ డైట్ చెయ్యాలి… ముప్పై యవ రోజు మందులు ఆపేసి ముప్పై ఒకటవ రోజు డాక్టర్ ని కలిసి ఆయన సలహా మేరకు మందులు ఆపెయ్యటమో లేదా డోస్ తగ్గించు కోవటమో చెయ్యాలి… అంతే కానీ మీ సొంత వైద్యము పనికి రాదు. డాక్టర్ సలహా పాటించ వలెను
THYROID: ధైరాయిడ్ మందులు వేసుకుంటూ డైట్ చెయ్యాలి. మొత్తం 112 డేస్ అయిన తరువాత డాక్టర్, సలహా మేరకు మందులు ఆపెయ్యాలి. అంతే కానీ మీ సొంత వైద్యము పనికి రాదు. డాక్టర్ సలహా పాటించ వలెను
గమనిక : చిన్నుల్లి పాయ / వెల్లుల్లి పాయ మీరు ఎంత తినగలిగితే అంత వంటల్లో , కర్రీస్ లో వాడుకోండి క్వాంటిటీ పరంగా లిమిట్ ఏమి లేదు…
1. ప్రస్తుతం diet చేసేవారు 24 రోజుల తరువాత ఒక నాలుగు రోజులు “కొబ్బరి నూనే కాని కానీ మిగతా ఏ విధమైన FAT “డైరెక్ట్” గా తీసుకేవడం మానివేయాలి. నాలుగు రోజుల పాటు వంటికి మాత్రం నెయ్యి, వెన్న , ఆలివ్ ఆయిల్ కానీ వాడుకోవాలి… తరువాత రోజు నుండి మాములుగా మన డైట్‌ను కంటిన్యూ చేయవచ్చును …ఈ నాలుగు రోజులు మీరు కావాలంటే ఆకలిని బట్టి 2 మీల్ కానీ 3 మీల్‌కానీ చేసుకోవచ్చు. అంటే 1 మీల్ వాళ్ళు కానీ 2 మీల్ వాళ్ళు కానీ “ఆకలి వేసినప్పుడు” మీల్ తీసుకోవచ్చును.
ఈ విధానం లో కూరలు / కర్రీస్ వండుకోవటాని ఎప్పటిలాగా 20-25 గ్రామ్స్ మాత్రమే వాడుకోవాలి. మొత్తం వన్ మీల్/ two మీల్ లో వాడుతున్న 70 గ్రామ్స్ వాడకూడదు.
ఈ ఎధం గా చెయ్యటం వల్ల “లివర్” మరింత శక్తి వంతంగా పని చేస్తుంది. మరియు లివర్ అంట చక్కగా శుభ్రం అవుతుంది. అందువనల ఈ ప్రక్రియ 24 రోజుల కి ఒక్కసారి ప్లాన్ చేసుకోవాలని అందిరికి మనవి.
2. 45 వ రోజు కానీ 50 వ రోజు కానీ 60 వ రోజు కానీ ఒక వారమంతా నిమ్మ రసం/ జ్యూస్ కానీ మజ్జిగ నిమ్మకాయ నీటిలో కానీ తీసుకుంటూ ఒక రోజు “ఫాస్టింగ్” చెయ్యాలి. ఈ రోజు అన్ని పిల్లర్స్, కర్రీస్ తీసుకోవటం అన్ని నిషేదము. మీరు ఆ రోజు వెల్లుల్లి పచ్చిగా కానీ నేటిలో వేయించి వీలు అయినంత నిమ్మకాయ రసంలో సాల్ట్ కూడా వేసుకోవచ్చు మరుసటి రోజు నుంచి డైట్ యధా ప్రకారంగా చేయవలెను.
ఈ ప్రక్రియ వల్ల మన “హృదయము ” మరింత శక్తివంతంగా మరియు ఆరోగ్య వంతంగా పని చేస్తుంది.
హ్యాపీ హ్యాపీ VRK గారి డైట్ మీరు పూర్తి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ …