బరువు/ పొట్ట తగ్గాలంటే To lose weight
బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి.
తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా *జీలకర్ర నానిన గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు కరిగిపోతాయి.
*సొరకాయను వారానికి మూడుసార్లు ఉపయోగించాలి.
*బొప్పాయిని తినాలి.
*మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు.
* లెమన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు.
* అరటి దూటల రసాన్ని సేవించడం,
*గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది.
*రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు.
వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.