కామ చూడామణి రసం…
బలము,వీర్యవృద్ది ,నరములకు శక్తినిచ్చి,కోరికలను పెంచుతుంది
×××××××××××××××××××××
కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా “కామ చూడామణి రసం”తో.
ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని వారు తెలిపారు. గర్భాశయం, అండాశయం, యోని ఇతర అవయవాలకు ఆరోగ్యాన్నిస్తుంది.
దీంతోబాటు అవయవ పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.
ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
కామ చూడామణి
కావలసిన వస్తువులు
సువర్ణ భస్మం,
రజితభస్మం,
ముక్త పిష్టి,
ప్రవాళపిష్ఠి
వంగభస్మం,
అబ్రక భస్మం,
సువర్ణమాక్షిక భస్మం,
పచ్చ కర్పూరం,
జాజికాయ,
జాపత్రి,
లవంగాలు,
ఏలకులు,
ప్రతిదీ 10 గ్రాములు తీసుకుని చూర్ణంగా తయారుచేసుకోవాలి.
తయారు చేయువిధానం…
వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరి,అశ్వగంధ,నెలగుమ్మడి,దూలగొండి, రసంలో కలిపి ఏడురోజుల వరకు ఉంచి నీడన ఆరించి చూర్ణము చేసి భద్రపరచుకోవాలి .
వాడేవిధానం…1 లేక 2 స్పూన్లను ఉదయం, రాత్రి
తియ్యటి పాలల్లో కలకండవేసుకొని
తీసుకోవాలి
కామ చూడమణి రసంవలన ఉపయోగాలు
ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించి. నరాలకు శక్తినిస్తు యవ్వనాన్ని కలిగించి కామశక్తిని కలుగ చేయును.
శరీరంలోని పిత్తం(ఆసిడ్) , మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను,తీక్షణమయిన మందులు తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది.
ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని అనుభవగ్యు లయిన వైద్యులు తెలిపారు.