శలభాసనము
శలభాసనము

శలభాసనము (సంస్కృతం: शलभसन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఇది మిడతను పోలిన ఆసనం కనుక దీనికి శలభాసనమని పేరు.

పద్ధతి

1.బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి.

2.గడ్డం నేలపై ఆ,నించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి.

3.ఈ స్థితిలో కొన్ని క్షణాలున్న తర్వాత మెల్లగా కాలు నేలపై ఆనించాలి.

4.ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి.

        మూడేసి సార్లు ఒక్కొక్క కాలితో చేసిన తర్వాత, రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పైకి ఎత్తి కొద్ది క్షణాలు ఆగాలి. తర్వాత మెల్లగా క్రిందికి దించాలి. ఈ రకంగా మూడుసార్లు చేయాలి.

        తర్వాత మకరాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనం

శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. నడుము సన్నబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here