రాగి సూపు (Ragi Millet Soup)
1. మొలకెత్తిన రాగి పిండి ,-50 గ్రాములు,
2. పచ్చిమిర్చి -1,
3.అల్లం ముక్క -1,2
4.మజ్జిగ -1 గ్లాసు,
5.నిమ్మకాయ -1,
6.కరివేపాకు కొద్దిగా,
7.కోత్తి మీర కొద్దిగా,
8. సైంధవ లవణం
తయారుచేయు విధానం :-
రాగి పిండి కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకోవాలిఒక పాత్రలో నీళ్లు వేసి వేడి చేసి దానిలో రాగిపిండి కలిపి వేడి చేసి కొద్దిసేపు తర్వాత పక్కన పెట్టుకోవాలి . కరివేపాకు దోరగా వేయించాలి పచ్చిమిర్చి అల్లం చిన్న మంటపై కాల్చాలి పచ్చి మిర్చి అల్లం కరివేపాకు మిక్సీలో వేసి పొడి లాగా పేస్ట్ చేసుకుని మజ్జిగలో కలపాలి. దానిలో సైంధవలవణముకలిపి రాగి జావలోమజ్జి గకలపాలి. నిమ్మరసం పిండాలి ఉదయం అల్పాహారం బదులుగా సేవించాలి. ఇష్టం ఉన్నవాళ్ళు అవసరమైతే ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి జావలో వేసుకుని త్రాగవచ్చు.
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ,ప్రతి ఒక్కరు కూడా ఈ జావను తాగవచ్చు.