Piles/మొలలు/మూలశంక
***********
మలవిసర్జన సమయంలో రక్తస్రావంతో తీవ్రమైన బాధను కలిగించే సమస్యే పైల్స్. దీనినే మూలవ్యాది మొలలు అని వ్యవహరిస్తారు. ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి అత్యాధునిక చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పైల్స్ ఎలా వస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చికిత్సల గురించి ఈ వారం ‘డాక్టర్ స్పెషలిస్ట్’లో తెలుసుకుందాం.
శరీరంలోని అనేక రక్తనాళాలు నిరంతరం ఒత్తిడితో రక్తాన్ని దిగువ నుంచి పైకి సరఫరా చేస్తుంటాయి. పురీష నాళంలో ఉండే ఇటువంటి రక్త నాళాలపై ఒత్తిడి పెరిగినపుడు రక్తం గడ్డకట్టి ఆ నాళాలు చిన్నచిన్న బొడిపెల్లా తయారౌతాయి. వీటినే ‘పైల్స్’ అంటారు. ఈ పైల్స్‌లో కొన్ని బహిరంగంగా, మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి, వీటిలో అంతర్గతంగా ఉన్న పైల్స్ మల విసర్జన మార్గం లోపలి గోడలకు అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి బయటకు కనిపించవు. వీటిమీద మ్యూకోసా అనే పొర మాత్రమే ఉంటుంది. బహిర్గత పైల్స్ మలవిసర్జన ద్వారం దగ్గర ఉంటాయి. వీటిమీదా మ్యూకోసా పొరతోపాటు, అదనంగా చర్మపుపొర ఉంటుంది. ఈ పైల్స్ బయటికి చొచ్చుకుని వచ్చి కనిపిస్తూ ఉంటాయి. విసర్జన సమయంలో ఎక్కువగా ముక్కినప్పుడు సున్నితమైన రక్తనాళాలు ఒత్తిడివల్ల సాగి, పిలకలవలే బయటికి వస్తాయి. ఏరకం పైల్స్ ఉన్నా బాధ తీవ్రంగానే ఉంటుంది.
లక్షణాలు
పైల్స్ నాలుగు దశల్లో వేర్వేరు స్థాయిల్లో ఉంటాయి
- తొలి దశలో ఏ బాధ లేకుండా చిన్న మొలలు ఉంటాయి, నొప్పి లేని స్వల్ప రక్త స్రావం ఉంటుంది.
- రెండో దశలో మొలలు బయటకు కనిపిస్తాయి, మల విసర్జన సమయంలో మంట, దురద ఉంటాయి. బలంగా ముక్కినప్పుడు పైల్స్ బయటికి వచ్చి తిరిగి లోపలికెళ్తాయి. లేదంటే వేలితో నెట్టినా లోపలికి వెళ్తాయి
- మూడో దశలో మొలలు పెద్దవిగా మారి, మల విసర్జనలో రక్తస్రావం నొప్పి, మంట ఉంటాయి.
- నాలుగో దశలో ప్రోలాప్సుడ్ మొలలు మరింత పెరిగి, రక్తం కారుతుంది.నొప్పి, మంట ఉంటాయి.
- మ్యూకోసాలో అల్సర్లు ఏర్పడటం వల్ల నొప్పి ఉంటుంది.
- ఈ మ్యూకోసా జిగురులాంటి పదార్థాన్ని స్రవిస్తుంది. పైల్స్ ఉన్నప్పుడు ఈ స్రావం ఎక్కువై, దుస్తులకు కూడా అంటుకుంటుంది.
- పైల్స్ ఏ దశలో ఉన్నా మలవిసర్జన చేసిన ప్రతిసారీ అవి రాపిడికి
గురవుతూనే ఉంటాయి. దాంతో రక్తస్రావం, భరించలేని నొప్పి ఉంటుంది. - ఈ బాధ భరించలేక మల విసస్జనను వాయిదా వేస్తూ ఉంటారు. దాంతో
మలం మరింత గట్టిగా తయారై, మరింత ఒరిపిడి కలిగిస్తుంది. బాధ
రెట్టింపవుతుంది. - వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే సరిగా నిలబడలేరు. కూర్చోలేరు.
-ఎక్కువగా రక్తం పోతుంటే నీరసం వస్తుంది. విపరీతంగా కాళ్ళూ
లాగుతాయి. విసుగు, కోపం వస్తాయి. రక్తహీనత కలగవచ్చు. - పైల్స్‌ని నిర్లక్ష్యం చేస్తే అది కొన్ని సందర్భాలలో క్యాన్సర్‌కి దారితీసే
అవకాశాలున్నాయి.
కారణాలు
- వంశపారంపర్యం
- సరైన ఆహార నియమాలు పాటించకపోవడం
- మలబద్ధకం
- రోజులో ఎక్కువ సమయంపాటు నిలబడి ఉండటం నపీచు లేని, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం
- మలబద్దకం వల్ల విసర్జన చేసేటప్పుడు ఎక్కువగా ముక్కటం
- ఆహారం సులభంగా జీర్ణం కావడానికి తగినన్ని నీళ్లు తాగకపోవటం
- గర్భీణుల్లో గర్భాశయం పెరగడంవల్ల కటి ప్రదేశం మీద ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల కూడా పైల్స్ వస్తాయి. అయితే వీరిలో ఇది తాత్కాలికమే. ప్రసవం తర్వాత వాటంతటవే తగ్గిపోతాయి.
- మద్యపానం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్న వాళ్లల్లో పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాలేయం దెబ్బతిన్నప్పుడు పేగుల నుంచి కాలేయానికి వెళ్లే నాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ రక్తనాళాల చివర్లు పురీషనాళంలో ఉంటాయి. కాబట్టి అక్కడ రక్తపు గడ్డలు తయారై, పైల్స్ ఏర్పడతాయి.
- ఇలా అంతర్గతంగా, ఆరోగ్యపరంగా పొత్తికడుపు, పురీషనాళాల మీద ఒత్తిడి పెరిగి ఏ కారణం వల్లైనా పైల్స్ ఏర్పడవచ్చు.
మన అలవాట్లు జీవన విధానం ను బట్టి వచ్చి అనేకులు అనుభవిస్తున్న వ్యాధుల్లో మూల వ్యాధులు కొన్ని. అందరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఇబ్బందిపడుతుంటారు.
వీటికి ఆయుర్వేదం మంచి ఔషధాలు చెప్పింది.
అడవి కందగడ్డను ఎండబెట్టి పొడి చేసి 80 గ్రాములు,
రసోతు. 40 గ్రా
పెనువేప విత్తులు పలుకులు 40 గ్రా
చిత్రమూలం 40 గ్రా
కరక చూర్ణం 30 గ్రా
శొంఠి 20 గ్రాములు,
మిరియాలు10 గ్రాములు
అన్నిటిని మెత్తగా చూర్ణం చేసి స్పూన్ రెండు పూటలా సేవించవలెను.
మూలవ్యాది తప్పక నశిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి, మలబద్ధకం పోతుంది.
ఎక్కువగా మజ్జిగ సేవించవలెను.
దీనిని సేవిస్తూ విముక్తి పొందగలరు.