పశ్చిమోత్తానాసనము (సంస్కృతం: पश्चिमोतनसन) యోగాలో ఒక ఆసనం. వెన్నెముకను పైకి వంచి చేసే ఆసనం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం లేదా పశ్చిమతానాసనం అని పేరు వచ్చింది. అతి ముఖ్యమైన యోగాసనాలలో ఇది ఒకటి.
పద్ధతి
1.నేలపై కూర్చొని రెండు కాళ్ళు చాపి దగ్గరగా ఉంచాలి.
2.రెండు చేతులతో రెండు బొటనవేళ్ళను పట్టుకోవాలి.
3.తలను మెల్లమెల్లగా ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనించడానికి ప్రయత్నించాలి. మోచేతులు నేలమీద ఉంచాలి. మోకాళ్ళు పైకి లేవకుండా జాగ్రత్తపడాలి.
4.తల వంచినంత సేపు శ్వాస వదలి బయటనే ఆపాలి. తల పైకి లేపిన తర్వాతనే శ్వాస పీల్చాలి.
ప్రయోజనం
ఈ ఆసనం పొట్ట కండరాలకు, లోపలి అవయవాలకు, వెన్నెముకకు చాలా ఉపయోగపడుతుంది.
ప్రాణశక్తి శుషుమ్నా నాడియందు సంచరించడం వల్ల దీనిని అభ్యాసం చేసేవారు దీర్ఘాయుష్మంతులవుతారు.