పేరు వింటేనే నౌకాసనం ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. అవును నౌకాసన భంగిమ నౌకలాగే ఉంటుంది. ఇందులో అవలంభించే పద్ధతి కొద్దిపాటి తేడాలు మినహాయించి ఊర్ధ్వ పాద హస్తాసన భంగిమలాగే ఉంటుంది.
ఆసన వేసే విధానం:
• నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి.
• మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు.
• దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి.
• ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి.
• గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి.
• ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి.
• అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి.
• కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి.
• మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి.
• ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది.
• శ్వాస గట్టిగా బిగపట్టండి.
• ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి.
• ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చేయడాన్నే నౌకాసనంగా చెబుతున్నారు.
• నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఆ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రండి.
ప్రయోజనాలుః
• ఈ నౌకాసన భంగిమ ద్వారా ఉదరం, వెన్ను, భుజ, మెడ, కింది భాగంలోని అవయవాలను పటిష్ట పరుస్తుంది.
• వెన్ను సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
• ఛాతీ భాగం వెడల్పయ్యేలా చేసి, మీ ఊపిరితిత్తులు బలపడేలా చేస్తుంది.
• ఈ ఆసనం వెన్ను చివరి భాగం, కాళ్లు, మోకాలి కింది కండరాలు, మోకాళ్లు, తొడలు, భుజాలు, నడుము భాగాలకు మంచి శక్తిని అందిస్తుంది.