Mayurasan
Mayurasan

మయూరాసనం (సంస్కృతం: मयूरसन ) యోగాసనాలలో ఒక ఆసనం. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి ఉంటుంది.

పద్ధతి – జాగ్రత్తలు

ఇది చాలా జాగ్రత్తగా సమతూకంగా చేయాల్సిన ఆసనం.

మొత్తం శరీరం బరువంతా కేవలం చేతులపై ఉంటుంది కనుక ఎప్పుడైనా బ్యాలన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ ఆసనం వేయటానికి శిక్షణ అవసరం

ఆసనం వేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ శరీరాన్ని ఒకేసారిగా కదలించటం చేయకూడదు.

ఆసనం వేసేటపుడు ఆయాసంగా ఉన్నా దగ్గు వస్తున్నా తిరిగి శిక్షణను ప్రారంభించండి.

ఉపయోగాలు

కడుపుకు సంబంధించిన అన్ని వ్యాధుల వారికి ఉపయోగపడును.

ఉదరావయములను చైతన్యవంతము చేయును.

భుజములను, మణికట్లను, మోచేతులను శక్తివంతము చేయును.

వాత వికారములను నివారించును.

ఉదరమునందలి ఎండోక్రైన్ గ్రంధులను పుష్టివంతము చేయును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here