మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.
పద్ధతి
ముందు పద్మాసనం వెయ్యాలి.
పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి.
రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.
కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.
ప్రయోజనం
ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.