covid-19 vaccine registration for above 18
covid-19 vaccine registration for above 18

పేర్లు నమోదుకొవిన్’ పోర్టల్ లో రిజిస్టర్ అవ్వండి లా..

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ మే 1 (శనివారం) నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ‘కొవిన్’ వెబ్ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకొని, స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకాను వేస్తామని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. స్పాట్ రిజిస్ట్రేషన్లను ఎంతమాత్రం అనుమతించబోమని తెలిపాయి. 18 ఏండ్లు పైబడిన అందరికీ టీకాల కార్యక్రమం మొదలవ్వగానే వ్యాక్సిన్ కోసం పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశమున్నదని, దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చని అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేందుకే, 18-44 ఏండ్ల వయసువారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్టు తెలిపారు. 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, టీకా కేంద్రంలో సైతం వాళ్లు (45 ఏండ్లు పైబడిన వారు) పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 28 (బుధవారం) నుంచి 18 ఏండ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘కొవిన్’ వెబ్ పోర్టల్ లేదా ‘ఆరోగ్యసేతు’ యాప్లో వివరాలు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

ఏటీకా వేసుకోవాలో మీ ఇష్టం!
18-44 ఏండ్ల వయసు వారి కోసం శనివారం నుంచి మూడోదశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. అయితే, వేసుకునే టీకా, కేంద్రాన్ని ఎంచుకునే సదుపాయం ప్రజలకు కల్పించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పేర్లను నమోదు చేసుకునే సమయంలోనే ‘కొవిన్’ పోర్టల్లో వ్యాక్సిన్ పేరు, ధర, టీకా కేంద్రం (ప్రభుత్వ, ప్రైవేట్) వంటి వివరాలు కనిపిస్తాయని, వాటిని అనుసరించి రిజిస్ట్రేషన్ను చేసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ వేయనున్న ప్రైవేట్ దవాఖానలు.. కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ (సీవీసీ) వివరాలను, వేయనున్న టీకా పేరు, నిల్వలు, నిర్ణయించిన ధరను ‘కొవిన్’ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని తెలిపింది. ఈ మేరకు రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే ప్రైవేట్ సీవీసీల్లో టీకాలు వేస్తారని తెలిపారు. ప్రభుత్వ సీవీసీలో కూ డా టీకాలను పొందవచ్చన్నారు. ప్రైవేట్ సీవీసీ అనుమతులపై రాష్ట్ర/జిల్లాస్థాయి యంత్రాంగాలే నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

‘కొవిన్’ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండిలా..


www.cowin.gov.in పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.
మొబైల్కు ఓటీపీ వస్తుంది.
వచ్చిన ఓటీపీని నమోదు చేసి వెరిఫై బటన్ను క్లిక్ చేయాలి.
ఆధార్, ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఫొటో ఐడీ ప్రూఫ్ కోసం దేన్నైనా ఎంచుకోవాలి.
పేరు, వయసు, లింగం తదితర వివరాలు నమోదుచేపి ఐడీ సాఫ్ట్కాపీని అప్లోడ్ చేయాలి.
రిజిస్టర్ బటన్ను క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తవ్వగానే, పేజీలో మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
కిందనున్న షెడ్యూల్ అపాయింట్మెంట్ బటన్ను నొక్కాలి.
రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్కోడ్ ఆధారంగా టీకా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీకా కేంద్రాలతో పాటు, ప్రైవేటు దవాఖానలు ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.
తేదీ, టీకా వయల్స్, ధరకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
నచ్చిన టీకా, ప్రాంతంను బట్టి అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవాలి.
అనంతరం అపాయింట్మెంట్ వివరాలతో ఫోన్కి సందేశం వస్తుంది.


ఆరోగ్యసేతులో రిజిస్ట్రేషన్ ఇలా..


గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
హోం పేజీలోని ‘కొవిన్’ ట్యాబ్పై క్లిక్ చేయాలి.
క్లిక్ చేయగానే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
అందులో వ్యాక్సినేషన్ ట్యాబ్పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ‘రిజిస్టర్ నౌ’పై క్లిక్ చేయాలి.
మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. (అనంతరం.. ‘కొవిన్’ పోర్టల్లో అనుసరించిన విధానాన్నే పాటించాలి)

ముఖ్యమైన వివరాలు

వ్యాక్సినేషన్‌కి అర్హులు: 18 ఏండ్లు పైబడినవారు
రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: బుధవారం (ఏప్రిల్‌ 28)
పేర్ల నమోదు వేదికలు: కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌
వ్యాక్సినేషన్‌ ప్రారంభం: శనివారం (మే 1)

Here is how to register for Covid-19 vaccination through the CoWIN portal:

Log on to www.cowin.gov.in.
Enter your mobile number.
Get an OTP to create your account.
Enter the OTP and click on the “Verify” button.
You will be directed to the registration of the vaccination’ page. On this page, there will be an option to choose one photo ID proof.
Fill in your name, age, gender and upload an identity document.
Click on the “Register” button.
Once the registration is completed; the system will show the “Account Details”.
A citizen can further add three more people linked with this mobile number by clicking on the “Add More” button.
There will be a button indicating ‘Schedule appointment’. Now click on it.
Search a vaccination centre of choice by state, district, block and pin code.
Date and availability will also be displayed.
Click on the ‘book’ button.
On successful completion of booking, you will receive a message. That confirmation details will have to be shown at the vaccination centre.


Here is how to register for Covid-19 vaccination through Aarogya Setu:

On the Aarogya Setu app homepage, go to the ‘CoWIN’ tab.
Under the CoWIN icon, you can see four options – Vaccine Information, Vaccination, Vaccination Certificate, Vaccination Dashboard.
Tap on the “Vaccination” tab and then select the “Register Now” option.
Enter your mobile number and then click on “proceed to verify”.
Enter the OTP and again select “proceed to verify”.
Once the number verification is done, you will have to upload a photo ID card.
You also need to fill in other details such as age, gender, year of birth.
You can register a maximum of 4 beneficiaries through the Aarogya Setu app.
You can also check for vaccination sites by state, district, block and pin code. The date and availability will be displayed. Select the “book” option.
Once registered successfully, you will receive an SMS with the appointment details.

COVID-19 Vaccination Phase 3: Documents Required
You will need at least one of the following documents at the time of registration, along with a Photo ID

Aadhaar Card
PAN Card
Voter ID
Driving License
Health Insurance Smart Card issued under by Ministry of Labour
Mahatma Gandhi National Rural Employment
Guarantee Act (MGNREGA) Job Card
Official identity cards issued to MPs/MLAs/MLCs
Passport
Passbooks issued by Bank/Post Office
Pension Document
Service Identity Card issued to employees by Central/ State Govt./ Public Limited Companies
The government said procurement, eligibility, administration of coronavirus vaccines is being made flexible. As per the order, vaccine manufacturers would supply 50 per cent of their monthly Central Drugs Laboratory released doses to the Government of India and would be free to supply the remaining 50 per cent doses to state governments and in the open market.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here