Hiccough
Hiccough

వెక్కుళ్ళు(Hiccough) అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా ‘హిక్’ అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో వెక్కిళ్ళను ‘హిక్క’ అని, ఆంగ్లంలో ‘హిక్కప్’ అని అంటారు.

వెక్కుళ్ళు వస్తున్నప్పుడు రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగడం, హఠాత్తుగా భయపడేట్టు చేయడం మొదలైనవి. వెక్కిళ్ళు చాలవరకు కొద్ది నిమిషాలలో సర్దుకుంటాయి. అలా తగ్గకుండా ఎక్కువకాలం రావడం ఒక వ్యాధి లక్షణంగా భావించాలి.


*ఎక్కిళ్లు నివారణకు చిట్కాలు* :-….

1. *పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి*

2. *ఒక్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి*. 

3. *పిచ్చితాటాకు నమిలి ఊటను మింగితే ఎక్కిళ్లుపోతాయి.*

4. *ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే పోతాయి.*

5. *నేల ఉసిరి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిళ్లు నిలిచిపోతాయి.* 

6. *తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లింటి ద్రవాన్ని అరకప్పుతాగినా పోతాయి. రాతి ఉసిరికాయలు తింటుంటే పోతాయి. ప్రతిరోజు వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి. కొబ్బరి నీళ్లు తాగితే తగ్గుతాయి.*

7. *కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాలవంటి పదార్థం వస్తుంది దీనిని తాగినా నిర్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి. నాలుకకు తరుచుగా తేనే రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి*. 

8. *జామ కాయను తిన్నా తగ్గుతాయి. శొంఠి లేదా కరక్కాయ పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకుని చెంచాడు తేనును కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లుపోతాయి*. 

9. *శొంఠి , ఉసిరి పలుకు వీటన్నింటిని సమ భాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజు రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.* 

10. *విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన నియత్రించొచ్చు.* 

11. *ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యమైన వార్తను చెప్పాలి. వెంటనే ఎక్కిళ్లు పోతాయి. ఆవాలను పొంగబెట్టి తాగిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.*

12. *వేపాకు పొడి ఉసికిరపోడినిస మాన మోతాడులో తీసుకుంటే తగ్గుతాయి.* 

13. *కాస్త చక్కరను నోట్లో వేసుకుని చప్పరిస్తే ఇది అన్నవాహికను ఒకింత చికాకు పరిచి మెడ నుంచి డయాఫ్రం వరకు వెళ్లే ఫ్రినక్‌నాటి సర్దుకునేలా చేస్తుంది. లేకపోతే ఒక చెంచాడు వెనిగర్‌నైనా తీసుకొని చూడండి *

14. *వేడి సూప్‌ కూడా ఉపయోగించొచ్చు. దీన్ని తాగినపుడు మనసు ఎక్కిళ్లు మీద కన్నా వేడి మంట మీదే లగం చేస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.* 

15. *గోరు వెచ్చని నీటిలో చెంచాడు. తేనె కలిపి నాలుక వెనుక భాగంలో వేసుకొని మింగి చూడండి తెనే ఏగస్‌ నాడిని సైతం ప్రేరేపిస్తుంది. కాబట్టి ఎక్కిళ్లు తగ్గడానికి తోడ్పడుతుంది.* 

16. *అల్లం సన్నగా తరిగి ఎక్కిళ్లు వచ్చినపుడు బుగ్గన పెట్టుకొని చప్పరించాలి.*

17. *రెండు చుక్కల వెనిగర్‌ నాలుక మీద వేసుకొని చప్పరిస్తే ఆ పుల్లదనానికి ఎక్కిళ్లు పోతాయి.* 

18. *కప్పున్నర నీళ్లలో చెంచా యాలకుల పొడిని వేసి మరిగించాలి. తరువాత వడకట్టి తాగాలి. ఆ నీళ్ల వల్ల గొంతు శ్వాస కోశ వ్యవవస్థ ఉత్తేజతమై ఎక్కిళ్లు తగ్గుతాయి*

19* నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు హరించును

20 * నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును .

పైన తెలిపిన రెండు యోగాలలో ఒక సులభ యోగాన్ని పాటించి నివారించుకోవచ్చు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here