Gomukhasana
Gomukhasana

గోముఖాసనం (సంస్కృతం: गोमुखसन) యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల దీనీకి ఆ పేరు వచ్చింది.

పద్ధతి

1.దండాసనంలో కుర్చోవాలి.

2.ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.

3.కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల దగ్గర ఉంచాలి.

4.కుడి చేతిని వెనుకకి మడిచి వీవు మీద ఉంచాలి.

5.ఎడమ చేతిని పైకి ఎత్తి వెనుకకి మడిచి వీవు మీదకి తీసుకురావాలి.

6.చేతులు రెండిటిని పఠంలో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి.

7.నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి.

8.కొద్ది క్షణాలు ఇలా చేసిన తరువాత మెల్లగా ఆసనం నుండి బయటికి రావాలి.

ఉపయోగాలు

ఛాతి, భుజము, కాలి కండరాలను బలోపేతం అగును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here