పిత్తాశయంలో రాళ్లు/bilestones
***********************
ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతం పిత్తాశయాన్ని చేరి పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తం తన యొక్క పాక గుణంతో దీన్ని ఒక రాయిలా తయారు చేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో పిత్తాశ్మరి అని ఆంటారు. ఆయుర్వేదంలో వాతాది దోషాల ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ను తగ్గించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ మనోహర్.
పైత్యరసంలో ఎక్కువగా కొలెసా్ట్రల్ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకొని కొలెసా్ట్రల్ స్టోన్‌గా మారుతుంది. కాలేయంలోని చనిపోయిన ఎర్ర రక్తకణాలు నాశనం చేసేటపుడు హీమోలైసిస్ అనే వ్యర్థ పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నపుడు పిగ్మెంటెడ్ స్టోన్స్ ఏర్పడతాయి.
కారణాలు : అధికంగా కొవ్వు పదార్థాలు, పాల పదార్థాలు తీసుకునే వారికి గాల్‌స్టోన్స్ వస్తాయి. స్థూలకాయుల్లో గాల్‌స్టోన్స్ రావచ్చు. సీ్త్ర హార్మోన్లు ఉన్న మందులు ఎక్కువగా వాడేవారు, పలుమార్లు గర్భం దాల్చిన సీ్త్రలలో పిత్తాశయం వ్యాధులు రావచ్చు. వంశపారంపర్యంగా పిత్తాశ్మరీ రావచ్చు.
లక్షణాలు : ఈ పిత్తాశ్మరీ పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కుడివైపు పక్కటెముకల కిందిభాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు వీపు భాగంలో వస్తుంది. నొప్పి హఠాత్తుగా మొదలై కొన్ని నిముషాల నుంచి, కొన్ని గంటల వరకు వస్తుంది. వాంతి వచ్చినట్లు ఉండటం, వాంతి రావటం, కడుపు ఉబ్బరం అనే లక్షణాలు కనిపిస్తాయి. ఈ రాయి పిత్తాశయ నాళంలో అడ్డుపడినపుడు కామెర్లు వచ్చే అవకాశం ఉంది. పిత్తాశయంలోనే రాయి స్థిరంగా ఉంటే ఏ లక్షణాలు కనిపించవు.
తెలుసుకోవడం ఎలా?
పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడితే తేలికపాటి నుండి ఒక మోతాదు పొత్తికడుపు లో నొప్పి తరుచు రావడం జరుగుతుంది. ఇ నొప్పి కూడా చాల చురుగ్గా, తరుచు గ వస్తుంటుంది. వాంతి వచ్చిన ఫీల్ కూడా కలుగుతుంది. కొన్ని సార్లు జ్వరం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు
నిర్ధారణ పరీక్షలు :
ఎక్స్‌రే ప్లెయిన్ అబ్డామిన్, రక్తపరీక్ష, అలా్ట్రసోనోగ్రఫీ- అబ్డామిన్ ద్వారా నిర్ధారిస్తారు. ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ అనే నూతన పద్ధతి ద్వారా రాయి పరిమాణం, అది ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు.
శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా?
గాల్‌స్టోన్ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నపుడు లితోట్రిప్సీ అనే సర్జికల్ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఇలా పిత్తాశయం తీసివేసిన వాళ్లలో అరుగుదల మందగించడం, కడుపు ఉబ్బరం, విరేచనాలు ఎక్కువ అవడం, కామెర్లు, జ్వరం వంటి లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఆయుర్వేద చికిత్స : ఆయుర్వేదంలో వాతాదిదోషాల ఆధారంగా చికిత్స చేయడం ద్వారా గాల్‌స్టోన్స్‌ను తగ్గించవచ్చు. శరీరంలో దోష సామ్యతను కలిగించడం ద్వారా గాల్‌స్టోన్స్ మళ్లీ తయారు కాకుండా నివారించవచ్చు. గోమూత్ర హరీతకీ, కోకిలాక్ష క్షార, కటుక రోహిణీ, భృంగరాజు, శూలవర్జినివటి, ఆరోగ్యవర్ధినివటి, గడూచీ లాంటి ఔషధాలను అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వాడితే పిత్తాశ్మరీ తగ్గుతుంది.
పిత్తాశయం లో రాళ్ళు ఉన్న వారు పాటించాల్సిన డైట్ నియమాలు
పిత్తాశయం లో రాళ్ళు రావడం తరుచుగా చూస్తుంటాం. ఇది కొంచెం సీరియస్ కండిషనే మిగతా వాటితో పోలిస్తే. అయితే, ఈ సమస్యతో బాధ పడుతునప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్య తీవ్రం అవ్వొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికిని. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలిక పరుస్తాయి కూడా. అవేమిటో పరిశిలిద్దాం.
దూరంగా ఉండాల్సిన ఆహారాలు
ఈ సమస్య ఉన్న వారు అధిక కొవ్వు గల అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా, ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహరాలు, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో తీసుకోవడం చేయాలి. అసిడిటీ మరియు గ్యాస్ కలగా జేసే అధిక స్పైసి ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండాలి. కురగాయలల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ లకు, అలాగే ఆల్కహాల్ కి కి కూడా దూరంగా ఉండాలి.
తీసుకోవాల్సిన ఆహారాలు
ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వొస్తే, ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినవచ్చు. ఆర్గానిక్ కూరగాయలు మరి మంచివి. అవకాడోస్, బీట్ రూట్, బెండ కాయలు, కంద గడ్డలు, ఉల్లిప్యాలు, తినవచ్చు. చేపలు మరియు ఇతర నీటి జంతువుల మాంసం తినవచ్చు. ప్నడ్ల లో ఆపిల్స్, పాపయ లాంటివి ఈ సమస్యను తగ్గించడం లో ఉపయోగ పడుతాయి.