హార్మోన్ల లోపం, స్థూలకాయం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు… వంటి కారణాల వల్ల చాలా మంది మహిళలు నేడు అనేక రుతు సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో చాలా మందికి నెలసరి సరిగ్గా రావడం లేదు. ఫలితంగా ఇది సంతానం కావాలనుకునే వారికి పెద్ద సమస్యగా మారింది. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే దాంతో స్త్రీలు తమ రుతు సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీంతో నెలసరి సరిగ్గా వస్తుంది. ఈ క్రమంలో సంతానం కలిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటంటే…
- బొప్పాయి పండు
బొప్పాయి పండును పూర్తిగా పండక ముందే అంటే కొంచెం పచ్చగా, దోరగా ఉన్నప్పుడే తినాలి. అలా తినడం వల్ల మహిళలకు రుతు క్రమం సరిగ్గా అవుతుంది. అయితే ఈ పండును పీరియడ్స్‌లో మాత్రం తినకూడదు.
- పసుపు
ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపును కలుపుకుని రోజుకు ఒకసారి ఎప్పుడైనా తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే రుతు సమస్యలు పోతాయి. రుతు క్రమం సరిగ్గా అవుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు స్త్రీలకు కలిగే రుతు సమస్యలను నయం చేస్తాయి.
- అలోవెరా
రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా (కలబంద) గుజ్జును తినాలి. దీంతో రుతు క్రమం సరిగ్గా అవుతుంది. పీరియడ్స్‌లో వచ్చే నొప్పి తగ్గుతుంది. పీరియడ్స్‌లో మాత్రం దీన్ని తీసుకోకూడదు.
- అల్లం
చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర లేదా తేనె కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు 3 పూటలా భోజనం చేసిన వెంటనే తాగాలి. దీంతో రుతు సమస్యలు పోతాయి. రుతు క్రమం సరిగ్గా అవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా సంతానం కలిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
- జీలకర్ర
రెండు టీస్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే జీలకర్రను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీంతో రుతు సమస్యలు పోతాయి. ఇలా రెగ్యులర్‌గా తాగితే ఫలితం ఉంటుంది.
- దాల్చిన చెక్క
ఒక గ్లాస్ వేడి పాలలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే కొద్ది రోజులకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. రుతు సమస్యలు పోతాయి.
- ప్రాణాయామం
పైన చెప్పిన చిట్కాలతోపాటు కపాలభత్తి అనే ప్రత్యేకమైన ప్రాణాయామ పద్ధతిని పాటిస్తే రుతు సమస్యలు పోతాయి. పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున పాటించాలి. గాలిని వేగంగా లోపలికి పీలుస్తూ వదులుతూ 5 నిమిషాల పాటు చేయాలి. దీన్ని ఒక ఆవృతం అంటారు. అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు. అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజూ చేయాలి. 5 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి. ఈ కపాలభత్తి ప్రాణాయామం చేస్తే రుతు సమస్యలే కాదు, ఇంకా అనేక సమస్యలు పోతాయి. అనారోగ్యాలు నయమవుతాయి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸