gluco meter
gluco meter

బ్లడ్ గ్లూకోజ్ ను హాస్పిటల్స్ లో, ల్యాబ్ లలో, లేదా ఇంటివద్దే గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది మీకు మీరుగా తెల్సుకోవాలంటే, అసలు అది నార్మల్ అయితే ఎంత ఉండాలనన్నది మీరు తప్పక తెల్సుకోవాలి. డయాబిటీస్ బాధితులు తప్పక తెల్సుకోవలసిన కొన్ని నార్మల్ రీడింగ్స్ పరిశీలించండి. అవసరం అనుకుంటే వీటిని బట్టీ పట్టేయండి.

ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్ 90 – 130 మధ్య ఉండాలి. పోస్ట్ ప్రాండియల్… అంటే ఉదయం టిఫిన్ తీసుకున్న తర్వాత రెండు గంటల అనంతరం బ్లడ్ గ్లూకోజ్ ….180 కన్నా తకన్కువగా ఉండాలి. మీ రక్తపోటు 130/80 ఉండాలి. ఎల్ డిఎల్ కొలెస్టరాల్ రీడింగ్ 100 కన్నా తక్కువగా ఉండాలి. ట్రిగ్లిసెరైడ్స్ రీడింగ్ 150 కన్నా దిగువన ఉండాలి. హెచ్ డి ఎల్ కొలెస్టరాల్ రీడింగ్ 40 కన్నా అధికంగా ఉండాలి.

ఇవన్నీ, ఓ డయాబిటీస్ పేషెంట్ లో నార్మల్ గా ఉండవలసిన రీడింగ్ లు. ముఖ్యంగా వీటిని మీరు గుర్తుంచుకుంటే, మీ బ్లడ్ గ్లూకోజ్ పరిస్ధితి, మీ రక్తపోటు పరిస్ధితి, కొలెస్టరాల్, ట్రిగ్లిసెరైడ్స్ పరిస్ధితి మీకు మీరుగా ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో తెల్సుకునే వీలుంటుంది.

రెగ్యులర్ బ్లడ్ గ్లూకోజ్ చెకింగ్ ఎవరికి అవసరం ఉంటుంది? రెగ్యులర్ సమయాలలో బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసుకోవలసిన అవసరం ఎవరికుంటుందో ముందుగా చూద్దాం.

– ఇన్స్ లిన్ తీసుకుంటున్నవారు.

– డయాబెటీస్ కోసం నిత్యం మందులు వేసుకుంటున్నవారు

– మహిళల్లో ప్రెగ్నన్సీ సమయంలో డయాబెటీస్ వస్తే,

– బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కాక చికిత్సలను మార్చుకుంటూ ఇబ్బందిపడే సమయంలో

– తరచు బ్లడ్ గ్లూకోజ్ బాగా తగ్గిపోతున్న పరిస్ధితిలో

– తరచుగా బ్లడ్ గ్లూకోజ్ బాగా పెరుగుతున్న సందర్భంలో

– ఎటువంటి వార్నింగ్ సిగ్నల్స్ లేకుండానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా పడిపోతున్నపుడు.

ఈ పరిస్ధితుల్లో విధిగా డాక్టర్ సూచన మేరకు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవటం సాధ్యంకాని సందర్భాలలోనే యూరిన్ చెక్ చేసుకోవాలి. యూరిన్ చెకింగ్ ను ఖచ్చితం అని భావించకూడదు. రెగ్యులర్ బ్లడ్ గ్లూకోజ్ చెకప్ కు అవకాశం లేనివారు లేబరేటరీలు, టెస్టింగ్ సెంటర్స్ అందుబాటులో లేనివారు, యూరిన్ షుగర్ ఆధారంగా తమ బ్లడ్ షుగర్ పరిస్ధితిని అంచనావేసుకోవలసి వస్తుంది. ఇందుకు డయాస్టిక్స్ రూపంలో స్టిక్స్ మెడికల్ స్టోర్ లలో దొరుకుతాయి. వాటి సాయంతో యూరిన్ షుగర్ చెక్ చేసుకోవచ్చు.

ఇలానే మార్కెట్ లో లభించే టెస్టింగ్ స్టిక్స్ సాయంతో యూరిన్ లో కీటోన్స్ కు కూడా చెక్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ ను నూటికి నూరు శాతం టైట్ గా కంట్రోల్ చేసుకోల్గిన డయాబెటిక్ రోగులు నిజంగా అక్షరాలా అదృష్టవంతులు. ఎందుకంటే డయాబిటీస్ బాధితులు ఈ విధంగా బ్లడ్ గ్లూకోజ్ ను గట్టిగా నియంత్రణ చేసుకోవడంలో సఫలం అయితే, డయాబెటీస్ కారణంగా ఎదురవుతాయని భావించే ఎలాంటి దుష్పరిణామాలు వీరికి ఎదురు కావు. ఎదురు కాకపోగా వారి ఆయుర్దాయం పెరుగుతుంది. అక్షరాలా మరో పది పదిహేను సంవత్సరాలు అదనంగా జీవించగలుగుతారు. కారణం, ఆహారం విషయంలో, వ్యాయామం విషయంలో ఇతరులతో పోలిస్తే వీరు చాలా చాలా శ్రద్ధగా ఉంటారు కనుక.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here