Dhanurasana
Dhanurasana

ధనురాసనము (సంస్కృతం: धनुरसन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు లేదా విల్లును పోలి ఉండటం వల్ల దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం మరియు శలభాసనం అను రెండాసనాల సమన్వయం.

పద్ధతి

ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి.

పద్ధతి 1 :

గడ్డం నేలపై ఆనించి భుజాలను ఆనుకుని ఉండేలా చూసి పాదాలను కొంచం ఎడంగా ఉంచాలి.

కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి.

గాలి సాధారణంగా పీల్చుకోవాలి .

కాళ్ళను మెల్లిగా వెనుకకు వంచాలి.

చేతులతో చీలమండలాలను గట్టిగా పట్టుకోవాలి.

తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి.

దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి.పది సెకనులు పీల్చుకోవాలి.

కనీసం 3 సెకనులు తరువాత గాలి మెల్లగా వదలాలి.

15 సెకనులు పూర్తిగా గాలి వదలాలి.

కాళ్ళు మెల్లగా వెనుకకు వదలాలి.

క్రమంమంగా మోకాళ్ళు, బొటన వ్రేళ్ళు దగ్గరకు చేర్చాలి.

పద్ధతి 2:

బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి.

కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది.

తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

సూచన

ధనురాసనం సమర్ధవంతంగా వేయాలంటే భుజంగాసనాన్ని, శలభాసనాన్ని మొదట చక్కగా అభ్యాసం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here