కరోనా నివారణకు మార్గాలు

0
333
The corona virus
The corona virus

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ప్రజలే నడుం బిగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా మార్గదర్శకాలను తూచ తప్పక పాటించాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశిస్తున్నాయి. ఇదే సమయంలో మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వివిధ మార్గాలను అనుసరించాలని, తద్వారా కరోనా వైరస్ మనపై ప్రభావం చూపకుండా చూసుకోవచ్చుని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

ఏదైనా వ్యాధితో పోరాడటంలో మన శరీరంలోని రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. కరోనాతో కూడా. రోగనిరోధక వ్యవస్థలు అనారోగ్యాలతో పోరాడటానికి రూపొందించబడ్డాయి. రోగనిరోధక శక్తిని వివిధ రకాలుగా పొందవచ్చు. ముఖ్యంగా 8 అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం ద్వారా మన శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధకతను పొందవచ్చు.

ఆహారం

రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు మనం నిత్యం కొన్ని ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వెల్లుల్లి నిత్యం రెండు, మూడు రెబ్బలు తినడం అలవాటు చేసుకోవాలి. అల్లం కనీసం 2, 3 గ్రాములు తినాలి. 1,2 గ్రాముల పసుపు మన ఆహారం ద్వారా అందాలి. నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నానబెట్టిన బాదాంపప్పులు నిత్యం నాలుగైదు తినడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్టీ తీసుకోవాలి.

వ్యాయామం

నిత్యం కనీసం ఆర్ధగంటపాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. వ్యాయామం

రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపర్చుతుంది. యోగా, స్ట్రెచింగ్, మెట్లు ఎక్కడం దిగడం, స్కిప్పింగ్ వంటి సాధారణ వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 100 అడుగులు నడిచేలా లేదంటే 30 నిమిషాలు నడక అలవర్చుకోవాలి. వీలుంటే ఇంటిపరిసరాల్లోనే సైక్లింగ్ చేయడం ఉత్తమం.

నిద్ర

మన వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కంటినిండా నిద్ర చాలా అవసరం. మన శరీరాన్ని ఉత్తేజాన్ని అందివ్వడంలో నిద్ర ఉపయోగపడుతుంది. నిద్ర కారణంగా శరీరంలో వ్యవస్థలు రిపేరింగ్ పొందుతాయి. రోజంతా చేసే పనుల బడలికతో వచ్చే ఒత్తిడి, ఆందోళనను నిద్ర దూరం చేస్తుంది. అయితే, మంచి నిద్ర పొందాలంటే మంచంపైకి పోయే అర్ధగంట ముందు టీవీ చూడొద్దు. మొబైల్ ఫొన్లను దూరంగాపెట్టాలి. పడుకునే వేళ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. వీలైతే సన్నటి మ్యూజిక్ వినేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

శుభ్రత-అలవాట్లు

కరోనా వైరస్ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతున్నది. ఈ నేపథ్యంలో మనం కొన్ని మంచి అలవాట్లను సొంతం చేసుకోవాలి. బయటకు వెళ్లి ఇంటికి రాగానే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే హ్యాండ్ శానిటైజర్ను వినియోగించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మంచి పరిశుభ్రత పాటించడం, సమయానికి భోజనం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వంటి మంచి అలవాట్ల ద్వారా కరోనా మన దరి చేరకుండా చూసుకోవచ్చు.

భావోద్వేగాలు

భావోద్వేగాలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అది మనల్ని కిందికి తొక్కేస్తుంది. భయం, ఒత్తిడి, ఆందోళన, కోపం, విచారం, భయాందోళనల కారణంగా వ్యాధినిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుకని భావోద్వేగాలను అణిచివేసేలా చూసుకోవడం చాలా అవసరం.

శ్వాస సంబంధ మెడిటేషన్

శ్వాస సంబంధ మెడిటేషన్, కార్డియోవాస్క్యులార్ ధ్యాన పరీక్షలు చేయడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒకేసారి ఐదు క్యాండిల్స్ ఆర్పడం, బెలూన్ను ఒకేసారి పెద్దగా నింపడం, ముక్కు ద్వారా గాలితీసుకుంటూ నోటి ద్వారా వదలడం.. ఇలా పలు విధానాల ద్వారా శ్వాసకోశ వ్యవస్థను బలహీనం కాకుండా చూసుకోవచ్చు. అలాగే నిత్యం ఉదయాన్నే మెడిటేషన్ చేయడం అలవర్చుకోవాలి.

పాజిటివ్ థింకింగ్

ధ్రువీకరణలు పూర్తిగా పాజిటివ్గా ఉంటాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడతాయి. సానుకూలంగా ఆలోచించడం అలవర్చుకోవాలి. ప్రతీ విషయాన్ని నెగెటివ్గా చూడొద్దు. నేను సురక్షితంగా ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా మార్గదర్శనం పొందుతున్నాను, అందరిపట్ల ఒకే ధోరణితో ఉన్నాను, అందరిని గౌరవిస్తాను, ఈరోజు నాకు ఎంతో సంతోషకరమైన రోజు అని అనుకుంటూ పాజిటివ్గా ఉండేలా చూసుకోవడం ద్వారా మరింత ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాం.

ఆలోచనలు

మనం చూసే దృష్టికోణంలో మార్పులు తెచ్చుకోవాలి. అందరినీ, అన్ని విషయాలను ఒకేలా చూడటం అలవర్చుకోవాలి. జీవితం సవాళ్లకు ఎదురీదేలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మార్పులను అంగీకరించాలి. విచారం, ఆగ్రహం మనల్ని వెనక్కి నెడుతాయి. అందుకని వీటిని పక్కన పెట్టాలి. మన వద్ద ఉన్నదానికి సంతోషపడాలి. పొందినదానికి కృతజ్ఞతలు తెలుపడం, ఎదుటివారి ఆశీర్వాదాలు అందుకోవడం చేయాలి. ఇతరులపై నమ్మకం పెంచుకోవాలి. అవసరమైన వారికి మార్గదర్శనం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here