main symptoms of corona in children
Corona viruse

కరోనా పంజా విసురుతోంది. కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసంతో ఉన్నవారిని పరీక్షిస్తే పాజిటివ్ వస్తోందంటున్నారు. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. అంతేకాదు కనుగుడ్డు నుంచి వైరస్ శరీరంలోనికి చేరుతోందని.. అప్పుడే కళ్లు ఎర్రబడుతున్నాయంటున్నారు.

ఓ జిల్లాలో ఓ వ్యక్తికి ముందు జ్వరం వచ్చి తగ్గింది. ఆ తర్వాత ఒళ్లు నొప్పులు తగ్గకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే వెళ్లి కొవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా తేలింది. ఒకవేళ ఎవరికైనా ఒళ్లు, కీళ్ల నొప్పుల ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో విరేచనాలు ఉన్నా పరీక్ష చేయించుకోవాలంటున్నారు. మూడు జిల్లాల్లో కేసుల్ని పరిశీలిస్తే ఇలా కొత్త లక్షణాలు బయటపడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఒళ్లు, కీళ్ల నొప్పులతో వచ్చిన వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ తేలిందని.. ఈ లక్షణాలు ఎక్కువ మందిలో కనిపించాయంటున్నారు.

సెకండ్ వేవ్లో ఎక్కువమంది యువత ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు తేలింది. సరిగ్గా మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతోందంటున్నారు వైద్యులు. 20-35 ఏళ్లలోపు వారికి ఎక్కువగా కరోనా సోకుతోందంటున్నారు. చాలామంది పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. వీరి నిర్లక్ష్యంతో కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లు వైరస్ బారిన పడుతున్నారని.. అప్రమత్తత అవసరం అంటున్నారు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం లాంటివి కోవిడ్ లక్షణాలు కాగా.. తాజాగా మరిన్ని బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్ ఎక్కువగా వస్తోందని గుర్తించారు. కనుగుడ్డు నుంచి కూడా వైరస్ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవే కాకుండా కీళ్లనొప్పులు, మైయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కొత్తగా వెలుగు చూస్తున్నాయి.

మరోవైపు గతంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందేందుకు గతంలో ఐదు నుంచి వారం రోజుల వరకు పట్టేది. ఇప్పుడు రెండు, మూడు రోజులకే అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయని, పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తోందంటున్నారు. అనవసర ప్రయాణాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తేనే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.

అందువల్లే ఫస్ట్ వేవ్ కంటే మరింత వేగంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోందని… ప్రజలు కూడా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉండడం వల్ల వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతోందని ఏపీ కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో శాస్త్రవేత్తలు కొత్త జాబితాను రూపొందించారు. కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇలా ఉన్నాయి.

కళ్లు ఎర్రబడడం:

కళ్లు ఎర్రబడడం లేదా కండ్లకలక అనేది అనేక వైరల్ ఇన్ఫెక్షన్లకు సంకేతం. అయితే దీనిలో కళ్లు ఎర్రగా, వాపుగా ఉండడంతోపాటు కంటి నుంచి నీరు వస్తుంది. చైనాకు చెందిన ఓ అధ్యయనం ప్రకారం కొత్త స్ట్రెయిన్ వైరస్ బారినపడిన వారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కళ్లు ఎర్రబడడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది.

జీర్ణ సంబంధిత సమస్యలు:

కరోనా సంక్రమణ ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, వికారం, నొప్పి అనేది కరోనా వైరస్ సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఎడురుకున్నట్లయితే.. దాన్ని తేలికగా తీసుకోకండి. వెంటనే టెస్ట్ చేయించుకోండి.

బ్రెయిన్ పనితనం తగ్గడం:

జ్ఞాపకశక్తి లేదా మొదడుకు సంబంధించిన సమస్యలను కరోనా వైరస్ అధికం చేస్తుంది. గందరగోళంగా ఉండడం లేదా విషయాలను గుర్తించుకోవడంలో ఇబ్బంది ఎదురైతే.. అది ఖచ్చితంగా కరోనా సమస్యకు సంకేతం. ఈ లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అసాధారణ దగ్గు:

కరోనా వైరస్ సాధారణ లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఆ ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే.. అది సాధారణ దగ్గుని పోలి ఉండదు. దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుంది. అలాగే మీ మాటలో కూడా మార్పు ఉంటుంది.

వినికిడి బలహీనత:

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా వినికిడి సమస్యలకు దారితీస్తుంది. 56 అధ్యయనాలు చేసిన అనంతరం కరోనా శ్రవణ, వెస్టిబ్యులర్ వ్యవస్థకి సంబంధించిన సమస్యలను సృష్టించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణ లక్షణాలు:

కరోనా సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి.. కొత్త లక్షణాలతో సహా ఈ లక్షణాలను మీలో గమనించినట్టయితే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించడం, ఇతరులతో భౌతిక దూరం పాటించడం, సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం, తిరిగి ఇంటికి రాగానే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here