బ్రహ్మముద్ర ఆసనం వేయటానికి పద్మాసన, సుఖాసన, వజ్రాసనంలాగా కూర్చోవాలి. మెడను మాత్రమే తిప్పటం ద్వారా ముఖాన్ని కుడివైపుకు కదపండి. ఈ క్రమంలో గడ్డమును కుడిచేతి భుజమునకు సమాంతరంగా అవకాశం ఉన్నంతవరకూ జరపాలి. ఆసనం వేస్తున్నపుడు మీ చూపును కుడివైపుకు మరల్చిండి. ఇదే భంగిమలో ఉంటూ దాదాపు ఐదుసార్లు ఊపిరి తీసుకోవాలి. తిరిగి ఆసనం ప్రారంభ భంగిమకు రండి. ఇదే విధంగా ఆ తర్వాత ముఖమును ఎడమవైపు దిశగా తిప్పాలి. ఇంతకముందు ఎలా చేశామో అలాగే దీనిని చేయాలి.
మెడ నరాలకు కాస్త విశ్రాంతి నివ్వాలి. ఆ తర్వాత తలను వెనక్కు తిప్పాలి. తిరిగి మరలా ప్రారంభ భంగిమకు రావాలి. మెడ కండరాలను వదులుగా ఉంచండి. తలను మరలా వెనక్కు తిప్పండి. ఈ రకమైన విశ్రాంతి పొందటం ద్వారా మీపై భూమ్యాకర్షణ శక్తి తగ్గుతుంది. కనురెప్పుల వైపుకు చూపును మరల్చిండి. ఆతర్వాత ప్రారంభ భంగిమకు రావాలి. తలను కిందకుపైకూ జరిపిన తర్వాత ముఖాన్ని మెల్లగా కుడిఎడమ వైపులకు తిప్పండి. ఈ నాలుగు కదలికలు కలిసి ఒక బ్రహ్మముద్రలో భాగం అవుతాయి.
శ్వాస పీల్చటం
బ్రహ్మముద్ర మూడవ దశలో తల పైకి వంచినపుడు అలాగే నాలుగో దశలో గడ్డమును ఛాతి వైపుకు దించినపుడు శ్వాస పీల్చటం కష్టమవుతుంది. ఈ సమయంలో ఊపిరి జాగ్రత్తగా పీల్చండి.
కళ్లు మరియు సావధానత
ఆసనం వేసేటపుడు బ్రహ్మముద్రను ఆచరిస్తున్నప్పుడు మరియ తిరిగి బయటకు వస్తున్నప్పుడు ముఖము ఏ వైపుకు తిరిగితే ఆ వైపుకు మీ చూపు ఆ దిశగా ఉండాలి.
జాగ్రత్తలు
బ్రహ్మముద్ర స్వంతంత్రంగా అభ్యసించవచ్చు. ముద్రలో ప్రతి దశలోనూ మూడు నుంచి ఐదు సార్లు శ్వాసను పీల్చండి. ఈ ముద్రను దాదపు ఐదు సార్లు చేయండి.
ప్రయోజనాలు
ఈ ఆసనం వేయటం ద్వారా మెదడు, గొంతు భాగాల్లో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కళ్లు, ముక్కు, చెవులు, నాలుక భాగాలు
చాలా చురుకుగా పనిచేస్తాయి. ఈ ఆసనం వేయటం వల్ల వాపు, శోధ వంటి రుగ్మతలనుంచి బయటపడవచ్చు. అదేవిధంగా అసాధారణంగా పెరిగే టాన్సిల్స్ వంటి వాటిని నివారించవచ్చు.