ఆయుర్వేదం – ప్రాథమిక అంశాలు
భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం. ఆయుర్వేదం అన్నది అక్షరాలా ‘జీవితం యొక్క శాస్త్రం’ అని అర్ధం. ఇతర వైద్య విధానాలలాగ కాకుండా ఆయుర్వేదం వ్యాధుల చికిత్స కంటే ఆరోగ్యకరమైన జీవనంపై మరింతగా దృష్టిని పెడుతుంది. ఆయుర్వేదంలోని భావన ఏమిటంటే ఇది కోలుకుని, ఉపశమనాన్ని పొందే ప్రక్రియను వ్యక్తిగతమైనదిగా చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం నాలుగు ప్రధాన అంశాలతో రూపొందించబడి ఉంటుంది – దోషం, ధాతువు, మలం మరియు అగ్ని. ఆయుర్వేధంలో ఈ నాలుగు ప్రధాన అంశాలకు అత్యంత విశిష్టత ఉంది. ఇవన్నీ
ప్రచురణలు సమాచారం
‘మూల సిధ్ధాంతాలు’ లేక ‘ఆయుర్వేదం యొక్క ప్రాథమిక మౌలిక అంశాలు’ అని కూడా పిలువబడతాయి.
దోషం
వాతం, పిత్తం మరియు ఖఫం దోషం యొక్క జీవనాధారం వంటి అతి ప్రధానమైన మూడు సూత్రాలుః ఇవి క్యాటబోలిజమ్ (జీవధాతు నిర్మాణమందు రసాయనిక శక్తి విడుదల అగుట), మరియు అనాబోలిక్ (వివిధ రకాలైన పరమాణువులను వాటి అతి సరళ స్ధితి నుండి వాటి శక్తితో సహా సంగ్రహించి సంయోగం చేయు ప్రక్రియ) మెటాబోలిజమ్ (జీవక్రియ–శరీరంలో కలుగు భౌతిక, రసాయనిక మార్పులు, కణములు వృద్ధి చెందునపుడు గాని, నాశనమగునపుడు గాని వాటి యందు కలుగు మార్పు)ను క్రమబద్ధీకరించి, నియంత్రిస్తూ ఉంటాయి. శరీర ధాతు నిర్మాణానికి సహకరించే, అరిగి జీర్ణమైన ఆహారం యొక్క ఉప ఉత్పత్తులను (బై ప్రోడక్ట్స్) శరీరమంతటా వ్యాపింపచేయడం ఈ మూడు దోషాల ప్రధాన విధి. ఈ దోషాలలో ఏది సరిగా పని చేయకపోయినా అది వ్యాధికి కారణమవుతుంది.
ధాతువు
ధాతువును శరీరానికి సహకారాన్ని అందించేదిగా వర్ణించవచ్చు. శరీరంలో ఏడు ధాతు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రం అనేవి. ఇవి వరుసగా ప్లాస్మా, రక్తం, కండరాలు, కొవ్వు కణజాలం, ఎముక, ఎముక మజ్జ (నూలగ) లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ధాతువులు శరీరానికి మూల పొషకాలను మాత్రమే అందిస్తాయి. ఇది మెదడు యొక్క నిర్మాణానికి, పెరుగుదలకు సహకరిస్తుంది.
మలం
మలం అంటే వ్యర్ధం లేక మురికి పదార్ధం అని అర్ధం. శరీరంలోని మూడింటి గుంపులో అంటే దోషాలు మరియు ధాతువులతో కలిపి ఇది మూడవది. ప్రధానంగా మూడు రకాలైన మలాలు ఉన్నాయి. ఉదాహరణకుః మలం, మూత్రం మరియు చెమట. మలం అనేది ముఖ్యంగా శరీరం యొక్క వ్యర్ధ పదార్ధంవంటి ఉత్పత్తి. ఒక వ్యక్తియొక్క ఆరోగ్యం సరిగా ఉండాలంటే శరీరం నుండి వ్యర్ధ పదార్ధం సక్రమంగా విసర్జన జరగాలి అనేది ముఖ్యం. మలంలో ప్రధానంగా రెండు అంశాలున్నాయి, అంటే మలం మరియు కిత్తా. మలం అనేది శరీరంలోని వ్యర్ధ పదార్ధాలకు సంబంధించింది, కిత్తా అనేదంతా ధాతువుల యొక్క వ్యర్ధ పదార్ధపు ఉత్పత్తి.
అగ్ని
జీవక్రియకు మరియు జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల క్రియలు అగ్ని అని పిలువబడే, శరీరంలోని జీవశాస్త్రపరంగా ఉండే ఎంజైములు విడుదల చేసే ఉష్ణం యొక్క సహాయంతో జరుగుతాయి. ఆహార నాళం, కాలేయం, ధాతుకణాలలో ఉండే వివిధ రసాయనాలనే ఈ అగ్నిగా పిలువవచ్చు.
శరీర నిర్మాణం
ఆయుర్వేదంలో జీవం అనేది మానవ శరీరం, ఇంద్రియాలు, మెదడు మరియు ఆత్మల సమ్మేళనంగా భావించ బడుతోంది. జీవించి ఉండే మనిషి మూడు దోషాలు (వాత, పిత్త మరియు ఖఫములు), ఏడు ప్రాథమిక ధాతు కణజాలాలు (రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రాలు) అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు (మలం, మూత్రం మరియు చెమట) లతో కలిసి ఉన్న ఒక సమ్మేళనం వంటిది. ఆ విధంగా మొత్తం శరీర నిర్మాణం శరీరంలో ఉండే ఈ దోషాలతోనూ, ధాతువులు, కణజాలంతోనూ మరియు వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తులతోనూ కలిసి వుంటుంది. రసాలుగాను, ధాతువులుగానూ మరియు వ్యర్ధ పదార్ధంగానూ జీర్ణ ప్రక్రియ ద్వారా మారే మనం తీసుకునే ఆహారం చుట్టూ శరీరాకృతి మరియు అవయవ సంబంధిత పెరుగుదల మరియు క్షీణత అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆహారాన్ని మింగడం, అది జీర్ణమవడం, శరీరం దానిని గ్రహించడం, జీర్ణమయింది వంటబట్టడం అనేవి మానసిక వ్యవస్థపైన, అలాగే జీవాగ్ని (బయో ఫైర్) పైన, ప్రభావితం చేస్తూ, చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపే మన ఆరోగ్యంతోనూ, వ్యాధులతోనూ ఒకదానితో మరొకటి అంతర చర్యలను కలిగి ఉంటాయి.
పంచమహాభూతాలు
ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంతో సహా విశ్వంలో ఉండే ప్రతి పదార్ధం, వస్తువూ కూడా, ఐదు ప్రాథమిక సూత్రాలతో (పంచ మహాభూతాలు) రూపొందించబడి ఉన్నాయి. అవిః భూమి, నీరు, అగ్ని, గాలి మరియు శూన్యం (ఆకాశం). ఈ అంశాలతో, వివిధ ప్రమాణాలలో, శరీరాకృతి మరియు దాని ఇతర భాగాల విధులకు అవసరమయ్యే మరియు వాటి శరీర నిర్మాణాలకు అమరే విధులకు అవసరమయ్యే, ఈ పంచభూతాల ఒక సమీకృత కూర్పు తగిన నిష్పత్తులలో ఉంది. శరీరాకృతి పెరుగుదల మరియు అభివృధ్ది వీటి పొషక విలువలపై ఆధారపడి ఉంటుంది, అంటే మనం తీసుకునే ఆహారం మీద, ఈ ఆహారం, తిరిగి శరీరంలో జీవాగ్ని నిర్వహించే చర్య పూర్తయిన తరువాత, ఇదే శరీరం యొక్క ఈ మాదిరి భాగాలను నింపడం లేక వాటితో పొషణనిస్తూ, పై ఐదు పంచభూతాలతో నిండివుంటుంది. శరీరంలో ఉండే ధాతువులు నిర్మాణసంబంధితమైనవి, అయితే పంచభూతాలనుండి వివిధ సమీకరణలు మరియు మార్పిడినుండి ఆవిర్భవించిన రసాలు మాత్రం మానిసిక సంబంధిత పదార్ధాల వంటివి.
ఆరోగ్యం మరియు అస్వస్ధత
ఆరోగ్యం లేక అస్వస్ధత అనేవి వివిధ అవయవాల మధ్య ఉండే సమతుల్యతతో సహా మొత్తం శరీరం యొక్క సమతుల్యత ఉందా లేక లేదా అనే పరిస్ధితిపై ఆధారపడి ఉంటుంది, ఇందులో అంతర్లీనంగా మరియు బాహ్యంగానూ ఉండే రెండు అంశాలూ సహజ సమస్ధితి, సమతౌల్యంలో విఘాతానికి, గందరగోళానికి కారణమై రోగాలకు దారితీయవచ్చు. విచక్షణారహితమైన ఆహారం, అనుచితమైన, అవాంఛిత అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన జీవనసరళి నిబంధనలను పాటించకపోవడం అనే వాటివల్ల సహజ సమతౌల్యం లోపించవచ్చు. వివిధ ఋతుసంబంధిత అసమానతలు, వైపరీత్యాలు, లేక సున్నితమైన శరీరాంగాల అనిశ్చిత, అస్ధవ్యస్థమైన అభ్యాసాలు లేక వాటి అనుచిత వినియోగం మరియు శరీరం, మెదడు యొక్క పొంతనలేని చేష్టలు కూడా ప్రస్తుతం ఉన్న మానసిక సమతౌల్యంపై విఘాతాన్ని సృష్టించడానికి కారణ మవ్వవచ్చు. ఈ విధంగా విఘాతానికి గురైన శరీరాకృతిని, మెదడును తిరిగి యధాస్ధితికి తీసుకురావడానికి ఆహారాన్ని తీసుకోవడాన్ని క్రమబధ్దీకరించడం ద్వారా, మామూలుగా రోజూ గడుస్తూ వుండే జీవన విధానాన్ని, ప్రవర్తనను సరిచెయ్యడం, మందులని సరైన రీతిలో వాడుతూ ఉండడం వంటి వాటి నివారణోపాయంతో ఉండే పంచకర్మలను మరియు రసాయనిక చికిత్సా విధానాన్ని అనుసరిస్తూ ఉండడం ఉంటుంది.
రోగ నిర్ధారణ
ఆయుర్వేదంలో ఎప్పుడూ కూడా రోగ నిర్ధారణ వైద్యుడు రోగిని పూర్తిగా పరిశీలించిన తర్వాత జరుగుతుంది. వైద్యుడు రోగి యొక్క అంతర్గత బౌతిక, శారీరక లక్షణాలను మరియు మానసిక స్ధితి, స్వభావాలను శ్రధ్ధగా గుర్తిస్తాడు. రోగికి సంబంధించిన ఇతర అంశాలను, అంటే శరీరంలో ప్రభావితం కాబడిన ధాతువులు, కణజాలం, రసాలు, రోగం కేంద్రీకృతమైన ఉన్న చోటు, రోగి నిగ్రహం, తట్టకోగలిగే శక్తి, అతని దినచర్య, ఆహారపు అలవాట్లు, చికిత్సా సంబంధిత పరిస్ధితుల ప్రాధాన్యత వల్ల కలిగే ప్రభావం, జీర్ణం చేసుకోగలిగే పరిస్ధితులు, రోగి యొక్క వ్యక్తిగత, సాంఘిక, ఆర్ధిక మరియు పర్యావరణ సంబంధిత పరిస్ధితి అనే అంశాలను కూడా అధ్యయనం చేస్తాడు. రోగ నిర్ధారణ ఈ క్రింది పరీక్షలతో సహా కలిసి ఉంటుందిః
- సాధారణ శారీరక పరీక్ష
- నాడి పరీక్ష
- మూత్ర పరీక్ష
- మల పరీక్ష
- నాలుక మరియు కళ్ల పరీక్ష
- చర్మం మరియు చెవుల పరీక్ష, స్పర్శ మరియు వినికిడి సంబంధిత పరీక్ష
చికిత్స
ప్రాథమిక చికిత్సా విధానం అనేది ‘మంచి ఆరోగ్యానికి రక్షణనిచ్చేది మాత్రమే సరైన చికిత్సా విధానం మరియు మనల్ని వ్యాధులకు దూరంగా ఉంచేవాడే మంచి వైద్యుడు’. ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాన్ని ఇది దృవీకరిస్తుంది, అంటే ఆరోగ్య పరిరక్షణ మరియు పెంపొందించుకోవడం, రోగ నివారణ మరియు అనారోగ్యానికి చికిత్స వంటివి.
వ్యాధి నివారణ లేక చికిత్స అంటే పంచకర్మ పధ్దతులననుసరించడం ద్వారా మందులను తీసుకుంటూ ఉండడం, సరైన ఆహారం, చురుకుగా ఉండడం మరియు సమతౌల్యాన్ని మరియు శరీర యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన అభ్యాసాలు, పథ్యాన్ని పాటిస్తూ ఉండడం భవిష్యత్తులో సంక్రమించకుండా వ్యాధుల నివారణ లేక వాటిని తగ్గించడం కోసం చికిత్స అనే వాటి ద్వారా శరీరం యొక్క, దాని ఆకృతిని, లేక దాని ఇతర ఏ అవయవాల యొక్క అసమతౌల్యం, అనిశ్చితస్ధితికి గురిచేసే అంశాలను నివారించడం.
సామాన్యంగా చికిత్సా చర్యలు మందుల వాడకం, ఖచ్చితమైన, స్పష్టమైన ఆహారం, అలాగే విహితపరచబడిన దినచర్యలు అనే వాటి ప్రమేయంతో ఉంటాయి. రెండు విధాలుగా ఈ మూడు చర్యలను వినియోగించుకోవడం జరుగుతుంది. చికిత్స చేసే ఒకటో విధానంలో ఈ మూడు చర్యలు కూడా రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలనూ మరియు వివిధ రూపాలలో రూపాంతరం చెందుతూ ఉండే రోగాన్ని తమ ప్రతిచర్య ద్వారా వ్యాధిని నిరోధిస్తాయి, రెండో విధానంలో ఇదే మూడు రకాలుః మందుల వాడకం, ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన దినచర్యలను రోగోత్పత్తి శాస్త్ర సంబంధిత అంశాలు మరియు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వుండే వ్యాధి ప్రక్రియల మాదిరిగానే తమ ప్రభావాన్ని చూపించే విధంగా లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాయి. ఈ రెండు రకాలైన చికిత్సావిధానాలు విపరీత మరియు విపరీతార్ధకారి చికిత్సలు అనే పేర్లతో, ఆ వరుసలో పిలువబడుతూ ఉంటాయి.
విజయవంతంగా చికిత్సను విర్వహించడానికి నాలుగు ముఖ్యమైన విషయాలున్నాయి. అవి:
- వైద్యుడు
- ఔషధ ద్రవ్యాలు
- సేవచేసే సిబ్బంది
- రోగి
ఈ ప్రాధాన్య క్రమంలో మొదటి అంశం వైద్యుడు. అతను సాంకేతిక నైవుణ్యాన్ని, శాస్ర్రీయ పరిజ్ఞానాన్ని, స్వఛ్చత మరియు మనిషి యొక్క మనోగతాన్ని అర్ధం చేసుకోగలగడం వంటి లక్షణాలను కలిగివుండాలి. మానవసేవ చేయడంలో వైద్యుడు తన కౌశల్యాన్ని, జ్ఞానాన్ని వినయం, విధేయత, నమ్రత, విజ్ఞతలను ఉపయోగించాలి. ఇక ఈ ప్రధాన క్రమంలో తరువాత వచ్చే రెండవ అంశం ఆహారం, మందులు. ఇవి అత్యంత నాణ్యతకలిగి, విస్తృతంగా వినియోగించుకోవడానికి తయారుచేయబడి, అనుమతింపబడిన పధ్దతుల ద్వారా పెంచబడిన మరియు తయారుచేయబడి ఉండి, చాలినంత మేరకు అందుబాటులో ఉండాలి. ఇక మూడవ అంశం, సేవలనందించడంలో మంచి తెలివితో, వారియొక్క వృత్తిలో, కళలో ఆరితేరి ఉండే మరియు ఆప్యాయత, జాలి, దయతో, తెలివితేటలు, పరిశుభ్రతతో, స్వయంసిధ్దులుగా ఉండే సేవలనందించే సిబ్బంది (నర్సులు) పోషించే పాత్ర. చివరిగా నాలుగో అంశం సహకార స్వభావంతో వైద్యుడి సూచనలను, సలహాలను విధేయతతో అనుసరిస్తూ ఉంటూ, తన ఇబ్బందులను, బాధలను చక్కగా వివరించి చేప్పగలిగి ఉంటూ, చికిత్సనందుకోవడానికి కావలసిందంతా చేయగలిగే రోగియే.
వ్యాధికి చికిత్స చేయడంలో, వ్యాధికి కారణమయ్యే లక్షణాలు ప్రారంభమైనప్పటినుండి చోటు చేసుకుని వ్యాధి చివరికి రూపాంతరం చెందే వరకూ సంభవించే సంఘటనలను, పరిణామాల వివిధ దశల యొక్క స్పష్టమైన విశ్లేషణాత్మకమైన వివరణలను విశదీకరిస్తూ వ్యాధికి చికిత్స చేయడంలో ఆయుర్వేదం అభివృధ్ది చేసింది. వ్యాధిని కలిగించే, ప్రఛ్చన్నంగా దాగివుండే, వ్యాధి రావడానికి అవకాశమున్న లక్షణాలను బయటపడడానికి ముందే కనిపెట్టగలిగే, అదనపు సౌలభ్యాన్ని ఈ ఆయుర్వేద పధ్దతికి ఇది కలిగిస్తుంది. వ్యాధి ప్రబలడానికి ముందు దశలోనే దానిని అరికట్టడానికి సరైన, సమర్ధవంతమైన చికిత్సాపరమైన చర్యలను తీసుకోవడానికి వీలును కలిగించడం ద్వారా అది మరింతగా వృధ్ది అయ్యే అవకాశాన్ని తప్పనిసరిగా నివారించే పాత్రను ఇది చురుకుగా పోషిస్తుంది.