arogyasetu
arogyasetu

ఆరోగ్యసేతు యాప్ గురించిన పూర్తి వివరాలు-All about Arogya setu mobile app

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకింది అక్కడి నుంచి ఈ మహమ్మారి మరెంతమందికి సోకిందనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన ప్రకటించగా కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రజలు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం లేకుండా ఉండేందుకు లేదా గుర్తించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వశాఖ కొత్తగా ఆరోగ్య సేతు అనే ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది.

లాక్‌డౌన్ పొడిగింపు పై ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో ఆయన ఆరోగ్య సేతు యాప్ గురించి మాట్లాడారు. ఆరోగ్య సేతు యాప్‌ను స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు ఇతరులతో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని ప్రత్యేకంగా కోరారు. ఈ యాప్ మనలను జాగ్రత్త పరుస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. కరోనావైరస్ నియంత్రించేందుకు ఆ మహమ్మారిని ట్రాక్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. లొకేషన్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో టచ్‌లోకి వస్తే వెంటనే యాప్ అలర్ట్ చేస్తుందని వివరించారు. ఎక్కువ మంది ప్రజలు వినియోగించడం వల్ల ఈ యాప్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుందని చెప్పారు. బ్లూటూత్ టెక్నాలజీ , ఆల్గరిథమ్స్, మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వ్యక్తి ఎవరెవరితో మాట్లాడాడు దాని వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందనేది ఈ యాప్ తెలియజేస్తుంది.

ఒక్కసారి ఈ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో ఇన్స్‌టాల్ చేసుకుంటే.. దగ్గరలో ఉన్న ఆరోగ్య సేతు ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న స్మార్ట్ ఫోన్లను డిటెక్ట్ చేస్తుంది. ఇక ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరొకరితో కాంటాక్ట్‌లోకి వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఎంత రిస్క్ ఉంటుందో కూడా లెక్కిస్తుంది. ఇందుకోసం కొన్ని పారామీటర్లను పరిగణలోకి తీసుకుంటుంది. దీని ఆధారంగా ఒక మనిషి కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎంతమేరకు ఉందో ఆరోగ్య సేతు యాప్ తెలుపుతుంది. ఇక అధికంగా ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమాచారం యాప్ చేరవేస్తుంది. ఇక ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఐసొలేషన్ అవసరమైతే ఆ చర్యలు కూడా తీసుకుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మిమ్మలను మీరు కాపాడుకోవాలంటే వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని సురక్షితంగా ఉండండి. యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

ఈ యాప్ కరోనా బాధితుడు మీ దగ్గరకు వస్తే చెప్పేస్తుంది..

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు 1,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీనిపేరు ‘ఆరోగ్య సేతు’. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ లొకేషన్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది. ఈ యాప్ లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికారవర్గాలంటున్నాయి. ‘ఆరోగ్య సేతు’ యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. వినియోగదారులు దీని ద్వారా ఆయా రాష్ట్రాల తాజా కరోనా సమాచారం ఎప్పటికప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు.

I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android :

arogyasetu
arogyasetu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here