Mayurasan
Mayurasan

సంపూర్ణ ఆరోగ్యదాయని యోగా. నిత్యం యోగా సాధన చేయడం వలన శారీరక, మానశిక పరమైన సమస్యలు దరిచేరవు. అయితే యోగా చేయడానికి ఒక విధానం ఉంది. దాని ప్రకారం చేస్తేనే మనం చేసే యోగా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే యోగాను అలక్ష్యదోరణిలో చేస్తే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.

ముఖ్యంగా యోగా పరకడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు. దుప్పటిపైన గానీ, చాప మీద కానీ యోగా సాధన చేయాలి. మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు యోగా చేయకూడదు. యోగా చేసే వారు సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించి యోగా సాధనను చేయాలి.

బాగా అలసటగా ఉన్నప్పుడు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రశాంతమైన వాతావరణంలో బాడీ, మైండ్ విశ్రాంతిగా ఉన్న స్థితిలో యోగా మొదలుపెట్టాలి. ప్రార్ధనతో సాధన ప్రారంభించాలి. ప్రార్ధన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శ్వాస తీసుకోవడం కానీ, వదలడం కానీ నాసిక ద్వారా మాత్రమే చేయాలి. యోగా సాధన ముగిశాక 20 – 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఆహారం కూడా యోగా చేసిన తర్వాత 20 -30 నిమిషాలకు చేయాలి.
ఆసనాలు వేసే ముందు మొట్ట మొదటగా మీరు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.

ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.

ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి.

తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోండి

ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి.

తెల్లవారు జామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.

శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here