The corona virus
The corona virus

ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు

కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్  చేస్తున్నారు.

ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

ఒకటి  CORADS

రెండు CT severity index

CORADS : దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటవి

CORADS …

అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది .

అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది ,  స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.

CORADS 1… ఏమి ఇబ్బంది లేదు.

CORADS 2… సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు.

CORADS 3.. సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు.

CORADS 4.  సిటి స్కాన్ బాగాలేదు, సిటి స్కాన్ లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

CORADS 5… ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

CORADS 6 … సిటీ స్కాన్ లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక Rapid antigen test పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.

So, ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు.

2 : CT severity index

మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటవి. ఒకటి కుడిపక్క ,  రెండవది ఎడం పక్క. ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు ( మూడు భాగాలు ) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది…. మొత్తం రెండు ఊపిరితితతుల్లో  మనకు 5 భాగాలు గా ఉంటాయి.

ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5… మొత్తం పాయింట్లు 25 అవుతుంది.

ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.

*0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు

1 : 5% కన్నా తక్కువ గా ఉంది

2 : 5 – 25  పర్సెంట్

3  :25 – 50%

4 : 50-  75%

5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది*

సో ,  ఒక్కొక్క లోబ్ లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది .

ఈ స్కోర్

8 కన్నా తక్కువ అయితే …mild ( తక్కువగా వుంది )

 8 నుంచి 15 అయితే Modarate ( ఒకమొస్తరిగా)

15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా)

  ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది .

కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.

 వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది.

అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది.

కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి , అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది.

 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ pulse oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు .

ఈ పల్స్ ఆక్సిమీటర్ లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి,

 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం.

  సో , ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 – 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు.

 CT Severity index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది.

ఈ సిటీ స్కాన్ లో  వ్యాది ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు .

  ground glass appearance

   Crazy paving pattern

   Consolidation

    Gradual resolution

  ఈ ground glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది

 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది

 10 నుంచి 13 రోజులు లో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది

14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్ లా  CT స్కాన్ లో కనిపిస్తుంది.

ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ ని సంప్రదించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here