Thyroid Disease
Thyroid Disease

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక రూపంలో, శ్వాస నాళానికి ఇరు పక్కలా ఉంటుంది. దీనినుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ లో (టి3) ట్రై- ఐడో థైరోనిన్,  టెట్రా – ఐడో థైరోనిన్ (టి4)- అనే రెండు హార్మోన్ లు, కొన్ని ఇతర రసాయన పదార్థాలు ఉంటాయి.ఈ హార్మోన్ లు మన శరీరంలోని దాదాపుగా కణజాలాలన్నిటిపై  ప్రభావం కలిగివుంటాయి. ప్రతి కణానికి ఇవి ప్రవహించి, వాటిపై ప్రభావం చూపి, జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడతాయి. థైరాయిడ్‌ హార్మోన్ ఏయిర్ కండిషనరులాగా పనిచేస్తూ, శరీరం ఎంతచురుకుగా, వేగంగా పనిచేయలో, శక్తి ఎలా వినియోగించుకోవాలో సూచనలిస్తుంది. శరీరంలో సరిపడా హార్మోన్లుంటే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. లేకపోతే ఉత్పత్తి ప్రారంభిస్తుంది.పిట్యూటరీ గ్రంధి, హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.  వివిధ కారణాలవలన థైరాయిడ్ హార్మోన్‌ ఉత్పత్తిలో ఎక్కువగా ఉండటం లేదా తక్కువగా ఉండటం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. వాటినే థైరాయిడ్ రుగ్మతలు అంటాం. ఫ్రస్తుతం మన దేశంలో ఇది ప్రధాన ఆరోగ్య సమస్య.

భారత దేశంలోని 8 నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం

  • పది మందిలో ఒకరు థైరాయిడ్ రుగ్మతలతో భాదపడుతున్నారు
  • పదిమందిలో ఎనిమిది మంది మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు గురవుతుంటారు
  • 35 సంవత్సరాలు  పైబడినివారిలో థైరాయిడ్ రుగ్మతల ప్రమాదం అధికంగా ఉంటుంది.
  • ఆటోఇమ్యున్ వ్యాధి,  డయాబెటీస్ వున్నవారిలో ప్రమాదం అధికంగా ఉంటుంది.
  • థైరాయిడ్ రుగ్మతలు కుటుంబాల్లో వారసత్వంగా వస్తాయని కూడా గమనించబడింది.

థైరాయిడ్‌ రుగ్మతకు గల కారణం ఏమిటి

  • గ్రంథి సరిగా పని చేయకపోవటం వలన
  • న్ని పుట్టుక సంబందమైన కారణాలవలన
  • డ్రగ్ల ప్రేరణ వలన
  • థైరాయిడ్‌ గ్రంథి ని తీసేయడం వలన
  • పిట్యుటరి గ్రంథి రుగ్మత వలన
  • అయోడైడ్ ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన

థైరాయిడ్‌ రుగ్మత వివరాలు తెలుసుకుందాం

థైరాయిడ్‌ రుగ్మతలను కనిపెట్టడానికి థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ (టి. ఎస్.హెచ్) రక్తం పరీక్ష చేస్తారు. దీని ద్వారా టి3, టి4, టీఎస్‌హెచ్ స్థాయిలను తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా కూడా రోగనిర్ధారణ చేసుకోవచ్చు

హైపర్ థైరాయిడిజం అని, హైపో థైరాయిడిజం అని రెండు రుగ్మతలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

హైపర్‌ థైరాయిడిజమ్‌

ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి వాసి పెద్దదవవచ్చు దీనినే గాయిటర్‌ అని కూడా అంటారు.

లక్షణాలు
నిముషానికి 100 కంటే ఎక్కువగా త్వరగా గుండె కొట్టుకుంటుందినరాల బలహీనత, ఆదుర్దా, చికాకుచేతులు వణకడంచెమటలు పట్టడంమామూలుగా తింటున్నా బరువు కోల్పోవటంవేడి తట్టుకోలేక పోవటంజుట్టు ఊడిపోవటంతరచూ విరేచనాలుకళ్ళు ముందుకు చొచ్చుకురావటంతరచూ రుతుస్రావంసక్రమంగా లేని గుండె లయ

హైపర్‌ థైరాయిడ్‌జమ్‌ తో బాధపడేవారికి గాయిటర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

గాయిటర్
థైరాయిడ్‌ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమయంలో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యాధాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్‌లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనిని వైద్యం తప్పనిసరి అవుతుంది.అటు హైపో, ఇటు హైపర్ థైరాయిడ్ రుగ్మతలు కలవారిలో కూడా గాయిటర్ వ్యాధి రావచ్చు. హైపో వారిలో థైరాయిడ్ హార్మోను తక్కువగా స్రవించబడుతుంది, కనుక ఎక్కువ స్రవింపచేయడానికి గ్రంధి ఉత్తేజ పరచ బడుతుంది. ఆ స్థితిలో థైరాయిడ్ గ్రంధి వాయడం జరుగుతుంది. అలాగే హైపర్ స్థితిలో గ్రంధి అధికంగా ఉత్తేజ పడటం వలన గ్రంధి వాస్తుంది

అయోడైజ్‌డ్‌ ఉప్పు

అయోడిన్‌ లోపం వల్ల తలెత్తే వ్యాధుల నివారణకు అయోడైజ్‌డ్‌ ఉప్పును ప్రజలు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. తల్లి గర్భంలో పడిన దగ్గర నుండి మూడేళ్ళు వయసు వచ్చే వరకు బిడ్డ మెదడు ఎదుగుదలకు కీలకమైన సమయం. ఈ సమయంలో బిడ్డకు తగినంత అయోడిన్‌ అందకపోతే బాగుచేయలేని హాని ఆ బిడ్డకు జరుగుతుంది. అందుకే అనుదినం పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా అయోడైజ్‌డ్‌ ఉప్పును వాడాలి. మన శరీరానికి అనుదినం 150 మైక్రో గ్రాముల అయోడిన్‌ అవసరం అవుతుంది. దాదాపు 15 గ్రాముల అయోడైజ్‌డ్‌ సాల్టులో ఈ మొత్తం లభించుతుంది. మనం తినే ఇతర ఆహార పదార్ధాలలో అయోడిన్‌ ఉన్నా నష్టం లేదు. ఎందుకంటే అవసరానికి మించి శరీరంలో అయోడిన్‌ చేరితే దానిని థైరాయిడ్‌ గ్రంథి శరీరం నుండి విసర్జింపజేస్తుంది.

హైపోథైరాయిడిజం

థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరాయిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు

  • అలసట, నీరసం
  • నిద్రమత్తు
  • ఏకాగ్రత కోల్పోవడం
  • పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు
  • దురద పుట్టించే పొడి చర్మం
  • ఉబ్బిన ముఖం
  • మలబద్దకం
  • శరీరం బరువెక్కడం
  • తక్కువైన రుతుస్రావం
  • రక్తహీనత

వీటి ప్రభావం శరీరంలోని వివిధ వ్యవస్థలపై పడుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

జీర్ణశక్తిపై థైరాయిడ్‌ ప్రభావం

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గినా దీన్ని శరీరం సరిగా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిన్‌ అనే హార్మోన్‌ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ముఖ్యం. ఇదిఉత్పత్తి కావటానికి గ్యాస్ట్రిన్ అవసరం. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం తగినంత ఉత్పత్తి కాకపోతే జీర్ణక్రియ మందగించి చిన్నపేగులు ఆహారాన్ని లోనికి అనుమతించవు. దీంతో ఆహారం జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోయి.. కుళ్లిపోవటం ఆరంభిస్తుంది. ఫలితంగా ఛాతీలోమంట, త్రేన్పుల వంటి లక్షణాలు మొదలవుతాయి. అంతేకాదు.. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం తగినంతగా లేకపోతే విటమిన్‌ బీ12, ఇనుము, క్యాల్షియం వంటి కీలకమైన పోషకాలను శరీరం సరిగా గ్రహించుకోలేదు. ఇది దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత, పోషణలోపం వంటి సమస్యలకూ దారితీయొచ్చు.

గుండెపై థైరాయిడ్‌ ప్రభావం

రక్తకణాల కండరాల కదలికలను నియంత్రించే శక్తి టి3& టి4 హార్మోన్లకు ఉంది. అందుచేత హార్మోన్ల హెచ్చు, తగ్గులు రక్తప్రసరణపైన, తత్ఫలితంగా రక్త పోటు పైనా ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి చెడు కొలెస్ట్రాలు, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలను కూడా పెంచుతాయి.

లివర్ పై థైరాయిడ్‌ ప్రభావం

టి4 హార్మోన్ , టి3 హర్మోనుగా రూపాంతరంచెంది 60% థైరాయిడ్ హార్మోన్ ఏర్పడడం లివర్లోనే జరుగుతుంది. ఇది చాలా కొద్ది సమయంలోనై జరిగే ప్రక్రియ. అందువలన టి3, టి4 ల హెచ్చు తగ్గులు క్రొవ్వుల శోషణను ప్రభావితం చేస్తాయి. టి3 హార్మొన్ ఎక్కువగా ఉన్నట్లైతే బిలిరుబున్ స్థాయికుడా పెరిగి, లివర్ ను విషపూరితం చేస్తుంది.

నిదురపై థైరాయిడ్‌ ప్రభావం

వేగంగా గుడె, నాడి కొట్టుకోవడం, అధిక రక్తపోటు వలన నిద్ర లేమి ఏర్పడుతుంది. నిద్రలేమివలన రక్త ఫలికలలోను, సీరంలోను ఉండే సెరోటినిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ రసాయనం నాడి ప్రచోదనాలకు చాల అవసరం. హైపో థైరాడిజం గల వారిలో కంటే, హైపర్ థైరాయిడిజం కలవారిలో నిద్రలేమి అదికంగా ఉంటుంది.

ఫునరుత్పత్తి అవయవాలపై థైరాయిడ్‌ ప్రభావం

హైపో థైరాయిడిజం కల వారిలో బహిష్టు సమయంలో అధిక రక్త స్త్రావం జరగడం, అబార్షన్ అవడం, గర్భమ ఫలించకపోవడం వంటి సంస్యలు అధికంగా ఉంటాయి.  ప్రోజెస్టిరాన్, ఈస్స్ట్రొజెన్  అనే రెండు ప్రత్యుత్పత్తి హార్మోనులు శరీరం లో నిర్వహించవలసిన విధులను హైపోథైరాయిడ్ స్థితి అడ్డుకుంతుంది.

పోషకాహారం తీసుకోవడంవలన థైరాయిడిజం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.

థైరాయిడ్‌ వారికి పోషకాహారము

  • బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
  • ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.
  • పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
  • సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.
  • వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
  • ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.
  • ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి.
  • పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది.
  • సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి.
  • సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి.
  • వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
  • హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది.
  • ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి.
  • ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి.
  • ఇదంతా చదివి ఆందోళన పడి స్వంత చికిత్స ప్రారంభించవద్దు. మీకు ఈ లక్షణాలు ఉన్నాయనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. వారి సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోండి. నిర్థారణ తర్వాత చికిత్స తూచా తప్పకుండా పాటించండి. ఆహార విషయంలో సలహాలకు, సూచనలకు గృవిజ్ఞాన కళాశాల ఆహారం మరియు పోషణ విభాగం పోషక సలహ కెంద్రాన్ని సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here