రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం, కొత్త ఢిల్లీ

  • ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఆయుష్ శాఖ, క్రింద ఉండే రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది సొసైటీస్ చట్టం 1860 క్రింద, 1988లో నమోదు కాబడిన రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం. 28 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నఆయుర్వేద పట్టభధ్రులకు, అలాగే 33 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లకు గురు శిష్య పరంపర ద్వారా, అంటే సాంప్రదాయసిధ్దమైన రీతిలో జ్ఞానాన్ని శిష్యులకు బోధించడం ద్వారా ఆధునికి, ఆచరణయోగ్యమైన శిక్షణనిస్తుంది.
  • రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం యొక్క ఈ రెండు సంవత్సరాల సభ్యత్వ కోర్సు ఆయుర్వేద సంహితాలలోనూ మరియు వాటిపై ఉండే వ్యాఖ్యానాలపైనా జ్ఞానాన్ని పొందడానికి, సాహిత్య పరమైన పరిశోధన చేయడానికి, అలాగే మంచి బోధకులు గానూ, పరిశోధనావేత్తలు గానూ మరియు సంహితలలో నిపుణులుగానూ తయారవడానికి వీలును కలిగిస్తుంది. ఆయుర్వేదంలో తమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసిన విద్యార్ధులు పొస్ట్ గ్రాడ్యుషన్ కు సంబంధించిన సంహితాలను విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడానికి ప్రవేశాన్ని పొందుతారు. వారు చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన అంశాలపై శిష్యులు పరస్పరం చర్చించుకునేందుకు సరిపోయినంత సమయాన్ని కలిగి ఉంటారు.
  • ఈ రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠంలోని ఒక సంవత్సరపు సర్టిఫికెట్ కోర్సులో (సి.ఆర్.ఏ.వి – CRAV) ఆయుర్వేదాచార్య (బి.ఏ.ఎమ్.ఎస్ – BAMS) లేక తత్సమానమైన డిగ్రీ కలిగివున్న అభ్యర్ధులు ప్రఖ్యాతి గాంచిన వైద్యుల క్రింద, మరియు సాంప్రదాయసిధ్దమైన చికిత్స చేసే వైద్యుల క్రింద మంచి చికిత్సను చేసే వైద్యులుగా తయారవడానికి, కొన్ని ఆయుర్వేద చికిత్సాసంబంధిత పధ్దతులపై శిక్షణ పొందుతారు.
  • భారతదేశ మంతటా ప్రకటన (అడ్వర్టైజ్ మెంట్స్) లనివ్వడం ద్వారానూ, వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్ధులకు ఈ కోర్సులలో ప్రవేశం ఇవ్వబడుతుంది. ఈ ఉభయ కోర్సుల లోను చదివే విద్యార్ధులు నెలకు రూ. 15,820/-లు శిక్షణాకాలంలో ఇచ్చే భృతితో పాటుగా సమయానుకూలంగా వర్తించే కరువు భత్యాన్ని (డి.ఏ) కూడా పొందుతారు. రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠంలో చదువుకునే విద్యార్ధులు నెలకు రూ. 2500/-లు అదనంగా పొందుతారు.

జాతీయ ఆయుర్వేద సంస్థ, జైపూర్

  • ఒక శాస్త్రీయ విధానంతో, ఆయుర్వేద చికిత్స విధానంలోని అన్ని అంశాలలోనూ అత్యున్నత ప్రమాణాలతో బోధన, శిక్షణ, మరియు పరిశోధనలు నిర్వహించడానికి, దేశంలో ఆయుర్వేదంలో ఒక శిఖరాగ్ర సంస్థగా ఈ జాతీయ ఆయుర్వేద సంస్థను భారత ప్రభుత్వంచే 1976లో నెలకొల్పడం జరిగింది.
  • పట్టభధ్రులు (గ్రాడ్యుయేట్లు) క్రింది స్ధాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పి.హెచ్.డి. స్ధాయిలో బోధన, వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఆంశాలలోనూ మరియు పరిశోధనలను నిర్వహించడంలోనూ ఈ సంస్థ నిమగ్నమై, జోధ్ పూర్ లోని రాజస్ధాన్ ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయంచే దేశవ్యాప్తంగా నిర్వహింపబడు ప్రవేశ పరీక్షల (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ టెస్ట్) ఆధారంగా గ్రాడ్యుయేషన్, క్రింది స్ధాయి కోర్సులకు ప్రవేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పి.జి. కోర్సులకు ప్రవేశం ఎన్.ఐ.ఏ మరియు ఐ.పి.జి.టి.ఆర్.ఏ (ప్రత్యామ్నాయంగా) చే దేశవ్యాప్తంగా నిర్వహించబడే ఉమ్మడి పి.పి. ప్రేవేశ పరీక్ష (I.P.G.T.R.A – ఆల్ ఇండియా జాయింట్ పి.జి.ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా ఇవ్వబడతుంది.
  • మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: National Institute of Ayurveda

పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధన మరియు ఆయుర్వేద పరిశోధనా సంస్థ, జామ్ నగర్ (గుజరాత్)

  • ఒక శాస్త్రీయ విధానంతో, ఆయుర్వేద చికిత్స విధానంలోని అన్ని అంశాలలోనూ అత్యున్నత ప్రమాణాలతో బోధన, శిక్షణ, మరియు పరిశోధనలు నిర్వహించడానికి, దేశంలో ఆయుర్వేదంలో ఒక శిఖరాగ్ర సంస్థగా ఈ జాతీయ ఆయుర్వేద సంస్థను భారత ప్రభుత్వంచే 1976లో నెలకొల్పడం జరిగింది.
  • పట్టభధ్రులు (గ్రాడ్యుయేట్లు) క్రింది స్ధాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పి.హెచ్.డి. స్ధాయిలో బోధన, వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఆంశాలలోనూ మరియు పరిశోధనలను నిర్వహించడంలోనూ ఈ సంస్థ నిమగ్నమై, జోధ్ పూర్ లోని రాజస్ధాన్ ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయంచే దేశవ్యాప్తంగా నిర్వహింపబడు ప్రవేశ పరీక్షల (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ టెస్ట్) ఆధారంగా గ్రాడ్యుయేషన్, క్రింది స్ధాయి కోర్సులకు ప్రవేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పి.జి. కోర్సులకు ప్రవేశం ఎన్.ఐ.ఏ మరియు ఐ.పి.జి.టి.ఆర్.ఏ (ప్రత్యామ్నాయంగా) చే దేశవ్యాప్తంగా నిర్వహించబడే ఉమ్మడి పి.పి. ప్రవేశ పరీక్ష (I.P.G.T.R.A – ఆల్ ఇండియా జాయింట్ పి.జి.ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా ఇవ్వబడుతుంది.
  • మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: Department of Ayurveda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here