వ్యాధికి చేసే చికిత్సను ఈ క్రింది విధంగా విస్తృతంగా వర్గీకరించవచ్చు.
శోధన చికిత్స (శుధ్దిచేయు చికిత్స)
శారీరక (సోమేటికి) మరియు మనోవికృత హేతుక శరీర జాఢ్య సంబంధిత (సైకో-సోమేటిక్) వ్యాధులకు కారణమయ్యే అంశాలను తొలగించే ఉద్దేశ్యంతో ఈ శోధన చికిత్స అనేది పనిచేస్తుంది. ఈ ప్రక్రియ అంతర్గత మరియు భాహ్య శుద్ధీకరణ (ప్యూరిఫికేషన్) తో ప్రమేయం కలిగి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చికిత్సతో ప్రమేయం కలిగి ఉండేవిః పంచకర్మలు ఎమిసిస్ (వైద్యపరంగా ప్రేరేపించబడి, నోటిద్వారా కడుపులోని పదార్ధాలను బయటకు కక్కించే ఒక ప్రక్రియ), పర్గేషన్ (విరేచనకారి మందు వాడకం), అయిల్ ఎనీమా (ఆయిల్ ను గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), డికాక్షన్ ఎనీమా (కషాయాన్ని గుదం ద్వారా లోనికి ఎక్కించే పధ్దతి), ముక్కు రంధ్రాల ద్వారా మందును లోనికి పంపే ప్రక్రియ. మరియు పంచకర్మ విధానానికి ముందు అనుసరించే పధ్దతులు (అంతర్గత మరియు బాహ్య ఓలియేషన్ మరియు చెమట పట్టడాన్ని ప్రోత్సహించే సాంబ్రాణి వాడకం) గా ఉంటాయి. జీవక్రియ నిర్వహణపై పంచకర్మ దృష్టిని సారిస్తుంది. చికిత్సా సంబంధిత లాభాలతో పాటుగా, ఇది అవసరమైన శుధ్ది చేయబడే ప్రభావాన్ని అదనంగా కలుగ జేస్తుంది, ముఖ్యంగా నరాల సంబంధిత అనారోగ్య సమస్యలకు, అస్ధిపంజర-కండర సంబంధిత వ్యాధి పరిస్ధితులలోనూ, కొన్ని రకాలైన రక్తనాళమయ లేక నాడీ-రక్త సంభంధిత పరిస్ధితులలోనూ, శ్వాస సంబంధిత అనారోగ్యంలోనూ, జీవక్రియ మరియు జీవక్రియ క్షీణిస్తూ ఉండే అనారోగ్యం వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా సహాయకారిగా ఉంటుంది.
షమన చికిత్స (ఉపశమనాన్నిచ్చే చికిత్స)
అణగారి ఉన్న విషపూరిత రసాయనాల (దోషాల)తో ఈ షమన చికిత్స ప్రమేయం కలిగివుంటుంది. ఈ విధమైన ఇబ్బందికరమైన దోషాలు తగ్గిపోవడం లేక ఇతర దోషాలలో అసమతుల్యాన్ని కలిగించకుండా, సాధారణ పరిస్థితికి తిరిగి చేరుకునే ఈ ప్రక్రియ షమనగా పిలువబడుతుంది. ఆకలిని పుట్టించే వాటిని, జీర్ణమవడానికి సహకరించే వాటిని, వ్యాయామాలు మరియు సూర్యరశ్మికి గురి కాబడడం, స్వఛ్చమైన గాలి మొదలైన వాటి ద్వారా ఈ చికిత్సను విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ చికిత్సా విధానంలో ఉపశమనాన్నిచ్చే వాటిని మరియు ప్రశాంతతను కలిగించే వాటిని ఉపయోగించడం జరుగుతుంది.
పథ్య వ్యవస్ధ (ఆహారం మరియు దినచర్యను వివరించడం)
పథ్య వ్యవస్ధ అనేది ఆహర, దినచర్య, అలవాట్లు మరియు భావోద్రేక పరిస్ధితులకు సంబంధించిన లక్షణాలను లేక ప్రతిలక్షణాలతో కలిసి ఉండేది. చికిత్సాపరమైన చర్యల ప్రభావాన్ని అధికం చేయడానికి మరియు వ్యాధిని పుట్టించే ప్రక్రియను నిరోధించే ఉద్దేశ్యంతో ఇది చేయబడుతుంది. అగ్నిని ప్రేరేపించడానికి మరియు తగినంతగా జీర్ణమవడానికి మరియు ఆహారాన్ని సమీకృతం చేయడానికి, దీని ద్వారా ధాతువులలో బలాన్ని కలిగించేటట్లు చూసే ఉద్దేశ్యంతో ఆహార విషయంలో చేయవలసిన మరియు చేయకూడని వాటిని నొక్కి చెప్పబడుతుంది.
నిదాన్ పరివర్జన (వ్యాధిని కలిగించే మరియు తీవ్రం చేసే లక్షణాలను నిరోధించడం)
ఆహారంలోనూ మరియు జీవనశైలిలోనూ రోగి యొక్క తెలిసి ఉండి, గుర్తించిన వ్యాధి లక్షణాలను నివారించడానికి లేక నిరోధించడానికే నిదాన్ పరివర్జన్ ఉద్దేశింపబడింది. వ్యాధిని పెంచి లేక తీవ్రతరం చేసే లక్షణాల నుండి జాగ్రత్తపడుతూ, వాటికి దూరంగా ఉంటూ ఉండాలనే భావాన్ని ఇది కలుగజేస్తూ ఉంటుంది.
మానసిక వ్యాధుల చికిత్స (సత్వవజయత్)
సత్వవజయత్ అనే మానసిక వ్యాధుల చికిత్స ప్రధానంగా మానసిక అలజడికి సంబంధించింది. ఇది మనసును అనారోగ్యకరమైన కోరికలను కలిగించే విషయాలనుండి దూరంగా ఉంచడం మరియు ధైర్యాన్ని అలవరుచుకోవడం, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించుకోవడం వంటి వాటితో కూడి ఉంటుంది. ఆయుర్వేదంలో మానసిక శాస్త్రాన్ని మరియు మనోవ్యాధుల చికిత్సా శాస్త్రాలను అధ్యయనం చేయడం, అలాగే మానసిక అనారోగ్యాల చికిత్సలో విస్తృత శ్రేణిలో అనుసరించే విధానాలూ అభివృధ్ది చేయబడ్డాయి.
రసాయన చికిత్స
రసాయన చికిత్స బలాన్ని, శక్తిని వృధ్ది చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరాకృతి పొందికగా ఉండడం, జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడం, వ్యాధి నిరోధక శక్తి, యవ్వనాన్ని, శరీర కాంతిని మరియు శరీర ఛాయను కాపాడడం మరియు శరీరం మరియు ఇంద్రియాల యొక్క శక్తిని, బలాన్ని అత్యున్నత స్ధాయిలో పోషించడం అనే కొన్ని సానుకూల లాభాలు ఈ చికిత్సా విధానానికి జత చేయ బడ్డాయి. శరీర ధాతువుల అకాల (పరిణతి చెందకుండానే) అరుగుదలను అరికట్టడం మరియు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య వ్యవస్థ మొత్తాన్ని పెంపొందించడం అనేవి ఈ రసాయన చికిత్స పొషించే పాత్ర.
ఆహారం మరియు ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేదంలో ఆహార నియమాన్ని ఒక క్రమ పధ్దతిలో, ఒక చికిత్సగా, పాటించడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇలా ఎందుకంటే, ఇది మానవ శరీరాన్ని ఒక ఆహార ఉత్పత్తిగా పరిగణిస్తుంది కాబట్టి. ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు ఆధ్యాత్మిక పెరుగుదల, అలాగే అతని స్వభావం, వ్యక్తిత్వం అనేవి అతను తీసుకునే ఆహారపు నాణ్యతతో ప్రభావితం చేయబడి ఉంటాయి. మానవ శరీరంలోని ఆహారం ముందుగా అన్నరసం లేక అన్నధాతుసారం లేక రసంగా మార్పుచెందుతుంది. అటు తర్వాత ఒకదాని వెంబడి ఒకటిగా ఈ ప్రక్రియ అంతా దీనిని రక్తం, కండరాలు, కొవ్వు, ఎముకలు, ఎముకలలో మజ్జ, పునరుత్పత్తికి అవసరమయ్యే మూల పదార్ధాలుగా మార్చడంతో కూడి ఉంటుంది. అన్ని జీవ ప్రక్రియలతో చెందే మార్పులకు మరియు జీవిత చైతన్యానికి ఈ విధంగా ఆహరం మూలాధారమైనటువంటిది. ఆహారంలో పొషకాలు కొరవడడం లేక సరిగా జీర్ణం కాకుండా, మార్పు చెందని ఆహారం అనేక విధాలైన వ్యాధులను కలిగించే పరిస్ధితులకు దారితీయవచ్చు.