#దేశీయ_గోక్షీరం_ఆరోగ్య_ప్రదాయిని
*****************************
ఆవు అంటేనే దేవత. ఆవులో సకల దేవతలు కొలువుంటారు. ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుంది. శుభకార్యాలకు ఆవును ఉపయోగిస్తుంటారు. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఎంతో పవిత్రమైనది. ఆవు ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆవు నుంచి వచ్చే పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో చూద్దాం.
1. కొంచెం, పలుచగా ఉండి త్వరగా అరుగుతుంది.
2. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం.
3. మనిషికి చలాకీని పెంచుతుంది.
4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు నశించును.
5. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
6. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణా తులను చేస్తాయి.
7. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
8 ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను ‘ఎ’ అధికంగా కలిగిన ‘కెసీన్’ అనే ఎంజైమ్ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
9. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
10. ఆవుపాలు సర్వరోగ నివారణి.
11. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
12. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.
13. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
14. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎము కలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక తినాలి..
15. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్‌డిఎల్ కొలెస్టరాల్‌ను పెంచి చెడుదైన ఎల్డిఎల్ కొలెస్టిరాల్‌ను తగ్గించును. హెచ్‌డిఎల్ కొలెస్టరాల్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
16. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన ‘స్వర్ణనాడి’ (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మనాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది. సూర్య కిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని ‘కెసీన్’ అనే ఎంజైమ్‌ను తయారు చేసి దానిని ఆవుపాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి. పాశ్చాత్య గోవులైన జర్సీ, హెచ్.ఎఫ్ వంటి గోవులకు మూపురం ఉండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు…
* మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
* పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
* దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.
* రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.
* పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.
* మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.
* చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.
* సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
* వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.
* ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.
* విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.
* మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.
* నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.
* మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.
* పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.
* జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది.
* మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం.
* జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది.
* మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి.
* పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార , ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.
*అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన.
* పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లని.