vellulli
vellulli

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.

ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. వీటిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విటమిన్లు, ఐయోడిన్ వంటివి ఉన్నాయి. 100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 శాతం ఉండగా, కార్బొహైడ్రేట్స్ 29.9 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు పదార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 310 మి.గ్రాములు, ఐరన్ శక్తి 1.3 మి.గ్రాములు, విటమిన్ సీ 13 మిల్లీ గ్రాములు, బి విటమిన్ కూడా ఇందులో ఉంది.

వెల్లుల్లిలోని వాసనకు కారణం అందులోని సల్ఫర్. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈ పాలు తాగి జలుబు తగ్గిపోతే రెండు పూటల తాగడాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాలను ఆస్తమా వ్యాధిగ్రస్తులు సేవిస్తే శ్వాసప్రక్రియ సక్రమమవుతుంది.

అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరుస్తుందని, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది.

1. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు అజీర్ణం. హైబీపీలను తక్షణం నివారిస్తుంది. శరీరంలోని ఇమ్యునిటీ లెవల్స్‌ని వెంటనే పెంచుతుంది.

2. అధిక బరువుతో బాధపడేవారు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.

3. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లెసిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది.

4. వెల్లుల్లి పేస్టుని చర్మంపై మొటిమలు, అలర్జీ వంటి వాటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని మోకాలిపై నొప్పి ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

6. వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగించడం వలన తరచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఆస్త్మా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.

7. వెల్లుల్లి ఇన్సులిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

8. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటిని మెుటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మెుటిమలు మరియు మచ్చలను సమర్ధవంతంగా నివారిస్తుంది.

9. వారానికి 5 వెల్లుల్లిపాయలను పచ్చివి తినటం వలన కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చట. కనుక దీనిని సర్వరోగ నివారిణి అనవచ్చు.

10. వెల్లుల్లిలో ధయమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ది చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన నోటి వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది.

11.క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 – 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు. ఈ రేమ్మలని వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి allinase అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ మరియు యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి.

క్యాన్సర్ మాత్రమే కాదు… తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼😒😒🌼🌼🌼🌼



వెల్లుల్లి ప్రయోజనాలెన్నో…!
++++++++++++++


బరువు తగ్గిస్తుంది:

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

గుండెను కాపాడతాయి:

రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

ఉదయాన్నే వెల్లుల్లి, తినడం వల్ల పొందే బెన్ఫిట్స్
++++++++++++!++++++++++
మీరు తరచుగా అలసిపోతున్నారా ? ఎలాంటి కారణం లేకుండా.. తీవ్రంగా నీరసించిపోతున్నారా ? ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే.. మీ వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతోందని సంకేతం. హెల్తీగా ఉండాలంటే.. స్ట్రాంగ్ ఇమ్యున్ సిస్టమ్ చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. లేటెస్ట్ స్డడీ: ఈ డ్రింక్ తో రోజు ప్రారంభిస్తే అనారోగ్య సమస్యలకు చెక్ కాబట్టి హెల్తీగా ఉండాలంటే..

వెల్లుల్లి, తేనె రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా.. ఏడు రోజు తీసుకోవాలి.

హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల.. రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందరి ఇంట్లో కామన్ గా ఉండే వెల్లుల్లి, తేనె రెండింటినీ తీసుకోవడం వల్ల మీ వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. అంతేకాదు.. ఈ రెండింటినీ ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఏడు రోజులు తీసుకుంటే.. అమోఘమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇమ్యునిటీ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరకడుపున తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా.. అరికడుతుంది.

కరోనరీ డిజార్డర్స్ కరోనరీ డిజార్డర్స్ అంటే.. రక్తం గడ్డకట్టడం. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి.. గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.

గొంతు నొప్పి వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.

డయేరియా ఈ పవర్ ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్ లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

జలుబు వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్ ను ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వెల్లుల్లి, తేనె రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.

డిటాక్స్ వెల్లుల్లి, తేనె మిశ్రమం తీసుకోవడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది. హెల్తీగా ఉంచుతుంది.




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here