Immune system boosters
Immune system boosters

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కరోనా లాంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. దీనికి కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే.. అందుకే అలాంటి సమస్యని తగ్గించేందుకు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో … ఇప్పుడు తెలుసుకుందాం…

*శరీరంలో రోగనిరోధక వ్యవస్థలివే…..*

తెల్లరక్తకణాలు, వినాళగ్రంథి, ప్లీహం (స్ప్లీన్‌) శోషరస వ్యవస్థ (కాంప్లిమెంటరీ సిస్టం), ఎముక మజ్జ (బోన్‌ మారో), చర్మం.

ఇమ్యూన్‌ సిస్టం బూస్టర్స్‌ …

సిట్రస్‌ పండ్లు: తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష.

రెడ్‌బెల్‌ పెప్పర్‌: సిట్రస్‌ పండ్లకంటే విటమిన్‌-సి రెట్టింపు ఉంటుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

బ్రోకోలి: విటమిన్‌ ఎ, బి, సి, ఈలు లభిస్తాయి. పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

వెల్లుల్లి: వ్యాధి కారకాలతో పోరాడుతుంది. రక్తపీడనం తగ్గిస్తుంది. దీనిలోని అల్లిసిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లం: వాపులు, గొంతు సంబంధిత వ్యాధులు నయం చేయడంతోపాటూ, కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.

పాలకూర: ఇందులో విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌, యాంటా ఆక్సిడెంట్లు ఉంటాయి.

యోగర్ట్‌: వ్యాధి కారకాలతో పోరాడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌-డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బాదం: ఇందులోని విటమిన్‌-ఇ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

పసుపు: ఇందులోని కర్కుమిన్‌ కండరాలలో కలిగే గాయాలను, వాపులను నిరోధిస్తుంది.

గ్రీన్‌ టీ: దీనిలోని ఫ్లేవనాయడ్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఎల్‌-థియానైన్‌ అనే అమైనా ఆమ్లం టీ-సెల్స్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

బొప్పాయి: విటమిన్‌ సి, బి, ఎ, కె ఎక్కువ. దీనిలోని పపైన్‌ వాపులను నివారిస్తుంది.

పౌలీ్ట్ర: టర్కీ చికెన్‌, కోడిమాంసం, చికెన్‌ సూప్స్‌ వల్ల ఆహార నాళం ఆరోగ్యకరంగా ఉంటుంది. విటమిన్‌-బి ఎక్కువ.

షెల్‌ఫిష్‌: పీతలు, లోబెస్టెర్స్‌, మస్సల్స్‌లో జింక్‌ ఎక్కువ. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



ఆహారం ఇలా తీసుకోండి…

ఉదయం 6.30 గంటలకు: వేడినీళ్లు, సగం నిమ్మకాయ, సగం టీస్పూన్‌ జీరా గోరువెచ్చని నీటితో, 45 నిమిషాల శారీరక శ్రమ (వాకింగ్‌, జాగింగ్‌), ఖర్జూర పండు లేదా అంజీర్‌ పండు, నాలుగు బాదం పలుకులు

7.30: గ్రీన్‌టీ… తులసి, అల్లం, పుదీనా, లవంగం, నిమ్మరసంతో.

9.00: బ్రేక్‌ఫాస్ట్‌ మొలకెత్తిన విత్తనాలు, ఓట్స్‌, ఉప్మా లేదా ఉడకబెట్టిన కోడిగుడ్లు రెండు

11.00: ఆరెంజ్‌, పుచ్చకాయ, దానిమ్మ, దోసపండు

మధ్యాహ్నం ఒంటి గంట: మధ్యాహ్న భోజనం- జొన్నరొట్టెలు రెండు, కప్పు అన్నం, ఒక కప్పు కూరగాయలు, దాల్‌, పెరుగు, చట్నీ, చేపలు, చికెన్‌, ఆకుకూరలు

సాయంత్రం 4 గంటలు: నారింజ, ద్రాక్ష, నిమ్మ, జామ

5 గంటలు: హెర్బల్‌ టీ, గ్రీన్‌టీ, 30 నిమిషాలు శారీరక శ్రమ

రాత్రి 8 గంటలు: రోటి, వెజిటబుల్స్‌, ఆకుకూరలు, 30 నిమిషాల వాకింగ్‌

10 గంటలు: 1/2 టీస్పూన్‌ పసుపు, 1/2 టీస్పూన్‌ శొంఠి , ఒక గ్లాస్ నీరు/పాలల్లో మరిగించి త్రాగాలి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఆయుష్ శాఖ సూచించిన *కాడ కషాయం నీ చాలా ఈజీ గా మీ ఇంట్లో తయారు చేసుకునే విధానం*

నీరు-0.5litre(రెండు పెద్ద మంచి నీళ్ళ గ్లాసులు)
మిరియాలు – 6/7 గింజలు
శొంఠి – చిన్న ముక్క
అల్లం – 3గ్రా.(చిన్న ముక్క)
దాల్చిన చెక్క-0.5 గ్రా.(చిన్న ముక్క)
తులసి ఆకులు-5/6
పసుపు- చిన్న చిటికెడు
బెల్లం – 6 గ్రా
ఇలాచి/యాలకులు -1
ముందుగా ఒక గిన్నె లో నీటిని 20నిమిషాలు బాగా మరిగించాలి. ఆ తర్వాత పదార్థాలు అన్ని వేసి ఇంకొక 15 నిమిషాలు బాగ మరిగించి వడకట్టాలి. బెల్లం బదులు తేనె వాడితే లాభం అధికం. పై పదార్థాలలో కొంచెం పెంచుతీనో, తగ్గిస్తేనో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ రోజూ మనం ఇంట్లో వాడుకునేవే. ముందుగా పొడి చేసుకొని కూడా వాడుకోవచ్చు. కొంచెం మిగిలితే సాయంత్రం వేడి చేసి తాగిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కదా అని మరీ ఎక్కువగా తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి రోజు కి ఒక టీ గ్లాస్ తాగిన సరిపోతుంది. ఈ అర లీటర్ కషాయాన్ని ఐదుగురు ఉదయం, సాయంత్రం తాగొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here