ద్రాక్ష భారతదేశంలో విరివిగా దొరికే ఒక ఫలం. సామాన్యునికి అందుబాటులో ఉండేదె కాకుండా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం నిచ్చే అద్భుతమైన ఫలము. ఇప్పటి నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. ద్రాక్షలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం
ద్రాక్షపళ్లు నలుపు , ఆకుపచ్చ , వంకాయ రంగులలో లభ్యం అగును. చిన్నవాటిలో గింజలు ఉండవు. పెద్దవాటిలో గింజలు ఉంటాయి.
. ద్రాక్షాపళ్లు మంచి పథ్యముగా , తియ్యగా , శరీరము నందు శాంతము కలిగించే విధముగా ఉండును. గొంతు , చర్మం, జుట్టు, కళ్ళకు సంబంధించిన సమస్యలకు అద్భుతముగా పనిచేయును . ఆకలిని పెంచును.
శరీరము నందు మంట, దాహము , జ్వరం , కుష్టు , క్షయ , క్రమం లేని రుతువులు , గొంతు సమస్య , వాంతులు , స్థూలకాయం , దీర్ఘకాల కామెర్లు అనగా హెపటైటిస్ వంటి వాటి మంచి ఔషధముగా పనిచేయును .
ఉదరము నందు ఆమ్లతత్వాన్ని తగ్గించును .
అనేక పురాతన ఆయుర్వేద గ్రంథాలలో యవ్వనాన్ని నిలిపి ఉంచుటకు ముసలితనం తొందరగా రానివ్వకుండా ఉంచుటలో ద్రాక్ష అద్భుతముగా పనిచేయును అని రాసి ఉంది. ఇవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. గ్యాస్ సమస్య కూడా తగ్గిపోవును . ద్రాక్షపళ్లు యూరిక్ సమస్యలు , మూత్రకోశములో మండుతున్న అనుభూతి , మూత్రపిండాలలో రాళ్లు నుండి మంచి ఉపశమనాన్ని కలిగించును.
ఈ ద్రాక్షపళ్ళు రసాన్ని వైద్యులు ఎక్కువుగా కీళ్ల వాపులు , ఋతుసంబంధ సమస్యలు , రక్తస్రావానికి వాడుతుంటారు. పచ్చి ద్రాక్షపండ్లలో ఎక్కువ ఆమ్లమూలాలు తక్కువ పంచదార ఉంటాయి. కాని పండిన ద్రాక్షపండ్లలో పంచదార మొత్తం గమనించదగినంత పెరిగిపోవును. ద్రాక్షలో ఉండే పంచదారలో గ్లూకోజ్ ఎక్కువుగా ఉండును. ద్రాక్షపండ్లను మిగతాపండ్లను సమాన తూకంలో తీసుకుని చూస్తే ద్రాక్షపండ్లలోనే గ్లూకోజ్ అధికంగా ఉండును. ద్రాక్షపండ్లలో ఉండే గ్లూకోజ్ శరీరంలో తొందరగా కలిసిపోవును.
రక్తహీనతతో బాధపడేవారు ద్రాక్ష రసం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ద్రాక్షలో ఉండే మాలిక్ , సిట్రిక్ , టార్టారిక్ ఆమ్లాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ప్రేగుల , మూత్రపిండాలు చురుకుపరుస్తాయి.
ద్రాక్షపండ్లు ప్రతినిత్యం తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తీరును . మొలల సమస్య కూడా తగ్గుముఖం పట్టును .
ఉదరంలో మండుతున్నట్టు ఉండే భావన శాంతపరచగలిగే శక్తి వీటికి ఉంది.సాధరణ బలహీనత , నిస్సత్తువ , నిలిచిపోయిన బరువు , చర్మం ఎండిపోవుట , దృష్టి డిమ్ముగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని వాడవలెను.
ద్రాక్ష రసాన్ని కొన్నిరోజులపాటు ఆగకుండా వాడటం వలన అనవసరమైన వేడి శరీరం నుంచి తీసివేయబడింది. శరీరం శుభ్రంగా , చల్లబడును. ద్రాక్షారసం తాగడం వలన రక్తవిరేచనాల లక్షణాలు అన్ని మాయం అవుతాయి. క్యాన్సర్ నయం చేస్తుంది. రక్తహీనత వలన బాధపడేవారు ప్రతినిత్యం 300 మి.లీ ద్రాక్షరసం తీసికొనవలెను.