Best ayurvedic treatment for migraine

 పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవేగానీ.. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చుగానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ.

వ్యాధి కారణాలు

  • పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
  • డిప్రెషన్, నిద్రలేమి
  • కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల
  • అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
  • స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
  • ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.

మైగ్రేన్ దశలు – లక్షణాలు

  1. సాధారణంగా 24 – 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు.
  2. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు
  3. మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది.
  • ప్రొడ్రోమ్ దశ : ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
  • ఆరా దశ : ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి.
  • నొప్పిదశ : ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సున్నితంగా అంటే చికాగ్గా అనిపిస్తుంది.
  • పోస్ట్‌డ్రోమ్ దశ : నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.

వ్యాధి నిర్ధారణ

రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్‌ఆర్

రక్తపోటును గమనించడం

ఈఈజీ పరీక్ష

సిటీ స్కాన్ (మెదడు)

ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి.

ఆయుర్వేద చికిత్స విధానం

ఈ సమస్య ఈ మద్య వచ్చింటె ఈ క్రింది రెమెడీ బాగా సహాయపడుతుంది, అదే 5 సంవత్సరాలనుంచి, 10 సంవత్సరాలనుంచి ఉంటే మాత్రం, ఖచ్చితంగా మీరు ట్రిట్మెంట్ తీసుకొవాలి,

అక్కలకర్ర 10గ్రా
జాజికాయ 10గ్రా
గసగసాలు 10గ్రా ( దోరగా వేయించిన )
కురుసాని వాము 10గ్రా
ఆకుపత్రి 10గ్రా ( బిర్యాని ఆకు)
శంఖ పుస్పి 10గ్రా
వజ 10గ్రా
సరస్వతి ఆకు 10గ్రా
శొంఠి. 10 గ్రా
యాలకులు. 10గ్రా

ఈ అన్ని వస్తువులు తీసుకొని ఈ వస్తువులకి సమానంగా పటిక బెల్లం వేసుకొని అలాగె కొద్ది మెతాదులొ తేనె నెయ్యి ముద్దలాగా అయ్యె లాగున చేసుకొని రోజు ఉదయం మద్యహ్యం రాత్రి బొజనానికి ముందు,
గోలి పరిమానం అనగా సుమారు కుంకుడుకాయ పరిమాణం తీసుకొంటె సమస్య ఖచ్చితంగా కొద్ది రొజుల్లొనె తగ్గును,
అలాగె మందును రోజు తీసుకొవాలి,3 మాసాలు నియమ ప్రకారం తీసుకొంటె సమస్య చాలా వరకు తగ్గును ఆ తర్వాత మీ సమస్య ను బట్టీ వాడడం లెదా నిలిపి వేయడం చేయెచ్చును

పై యేగం చేస్తూ, మీరు రోజు అలొవెరా శాంపుతొగానీ లెదా శీకాకాయ శాంపూతో గానీ వెచ్చని నీటితో తల స్నానం చేయాలి,

తల స్నానం చేసెటప్పుడు, నీరు లేదా నీటి ఆవిరి చెవిలో పొకుండా కాటన్ పెట్టుకొవాలి, ఇది ఖచ్చితంగా చేయాలి,
మైగ్నెన్ వచ్చినప్పుడు, స్వచ్చమైన ఆవునెయ్యి తీసుకొని రెండు చుక్కల పరిమాణంలో రెండు ముక్కురంద్రాలల్లొ పీల్చుకొవాలి,

అలాగె వారానికి ఒక్కసారైనా చెవిలొ మంచి ఆముదం 5 చుక్కల చొప్పున వేసుకొని కాటన్ పెట్టుకొని నిద్రపొవాలి దీనివల్ల మెదడులోని నరాలన్నీ చల్లబడి మీకు వచ్చె తలనొప్పిని తగ్గిస్తాయి.
వేడివస్తువులు, మాంసాహారాలు తీసుకొకూడదు
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼😊😊🌼🌼🌼🌼🌼

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here