మచ్చల నివారణ
- పచ్చి బొప్పాయిని గిల్లినప్పుడు వచ్చే పాలను రాయుచున్న మచ్చలు తగ్గును.
- గోధుమపిండిని పులియబెట్టిన కడుగులో కలిపి మచ్చలపైన ప్రతినిత్యం పూయుచున్న మచ్చలు హరించును ..
- కొంచం నీటిలో పసుపు,మంచి గంధం వేసి చిక్కగా కలిపి రోజూ రాయుచున్న శరీర మచ్చలు తగ్గును.
- మంచి నాణ్యమయిన కుంకుమపువ్వు నీటితో తడిపి మచ్చల పైన పూయుచున్న మచ్చలు తగ్గును.
- ప్రతినిత్యం జాజికాయ అరగదీసి ఆ గంధాన్ని రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చల నివారణ అగును.
- అవిసె గింజల నూనెను ప్రతిరోజు రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చలు మాయం అగును.
- జీడిమామిడి గింజల పైపెచ్చులు నలగగొడితే వచ్చే నూనెని మచ్చలపైన రాయుచున్న త్వరగా మచ్చలు హరించును
- నేలతంగేడు వ్రేళ్ళను తీసుకొచ్చి నీడలో ఎండించి ఎండిన వేళ్ళను నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని మచ్చలపైన రెండుపూటలా రాయుచున్న మచ్చలు నివారణ అగును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸