శరీరం లో పోషకాంశములు లోపము వలన నోటి యందు మరియు నాలుకు పైన తెల్లని పూత ఏర్పడును. పెదవి చివరులు కూడా ఎర్రగా అయి పుండువలె అగును. పెదవి చివర ఎర్రగా అయ్యి పుండు వలె అగును. నాలుక, నోరు పగిలి ఎర్రగానగును. సరిపడని ఆహార పదార్దములు తినినప్పుడు, ఎక్కువ కారము, పులుపు మరియు క్షారగుణము కలిగిన పదార్దములు అధికముగా సేవించినను నోరు పెచ్చును. నోటిలో మంట ఆహారము తినుచున్నప్పుడు బాధ కలుగును. కొన్ని టూత్ పేస్టు లు వలన కూడా నోటిలో కురుపులు, పూత వచ్చును.
చిట్కాలు :
1.బియ్యమును కడిగిన నీటిలో కొద్దిగా కలకండ కలిపి, 30 మీ.లి రోజుకి రెండుసార్లు త్రాగాలి.
2. జాజికాయ పాలలో అరగదీసి, తీసిన గంధమును నాలుక పైన పూయచుండిన 4 లేక 5 రోజులలో నాలుక పూత తగ్గిపోవును.
౩.పటికను నీళ్ళలో కలిపి పలుచటి ద్రావణము చేసుకోవలెను. ఒక గరము పటిక చూర్ణము 100 మీ.లి. నీళ్ళలో కలిపిన చాలును. ఈ ద్రావణముతో నోరు పుక్కిలించిచుండిన నోటి పూత హరించును.
4.నోరు పుచినచోట అవ్వు నెయ్య వ్రాసిన నోటి పూత తగ్గును.
5.చిన్న పిల్లలకు నోటి పూత వచినప్పుడు ఉసిరికాయ మెత్తగా ముద్ద చేసి చనుబాలలో కలిపి నోటిలో పుయ్యవలెను.
6. కొత్తిమిరను ముద్దగా నూరి ఒక టి చెంచాడు ముద్దను ఒక గ్లాసు నీటిలో కలిపి సన్నని మంట పైన సగం మిగులు వరుకు మరిగించి కాషాయం చెయ్యవలెను. ఈ కొత్తిమీర కాషాయమును కొద్ది కొద్దిగా నోటిలో పోసుకొని పోక్కిలించిచుండిన నోటి పూత మరియు కురుపులు తగ్గును.
పాటించవలిసిన ఆహార పద్దతులు :
సులభముగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవడం
నెయ్య, ఆకుకూరలు,పండ్లు ఎక్కువ తినడం
దంపుడు బియ్యం లేదా బియ్యం ఎక్కువ తినకుండా వండిన అన్నం తినవలెను.
మాంసాహారం తగ్గించవలెను.
నోటిపూత తో బాధ పడేవారు కారము , పులుపు, ఉప్పు, ఎక్కువగా ఉన్న పదార్ధాలు తినరాదు.
ఆహారము తిన్న తరువాత, నోరు శుభ్రం చేసుకోవడం మరిచిపోకూడదు.
తాంబూలము సేవించిన మేలు కల్గును