padmasanam
padmasanam

పద్మాసనముపద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.

పద్ధతి

మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.

తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.

రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.

ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.

ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here