Padahastasanam
Padahastasanam

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి.

పద్ధతి

1.నిటారుగా నిలబడాలి.

2.మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.

3.శరీరం ను మెల్లగా పైకి సాగదీసి కటి(hip) భాగము నుండి ముందుకు వంచాలి. ఈ స్థితి లో శరీరము 900 కోణము లో      కనిపించును.

4.ఇప్పుడు మెల్లగా చేతుల ను పఠం లో చూపిన విధంగా పాదాలకిరువైపులా ఉంచాలి. తలను మోకాలికి ఆనించాలి.

         ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి.

ఉపయోగాలు

ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును.

అజీర్ణము(Indigestion), మూలశంఖ(constipation), ఉదర వాయువుల సమస్యల(gastric troubles) ను తగ్గించును.

వెన్నుముఖకు శక్తినిచ్చును.

రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును.

వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here