1 . శరీరంలో నరాలన్నీ బలహీనంగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే
అతిబల వేళ్ళు -100 గ్రాములు,
అశ్వగంధ దుంపలు – 100గ్రాములు,
నేలతాడి దుంపలు – 100 గ్రాములు,
అతిమధురం వేళ్ళు – 100 గ్రాములు,
పెడ్డదూలగొండి విత్తులు 100 గ్రాములు
పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా ,ఏడుసార్లు చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి
దీనికి
అక్కలకఱ్ఱ 25 గ్రా
జాజికాయ 25 గ్రా
జాపత్రీ. 25 గ్రా
చూర్నించి కలిపి నిలువచేసుకొనీ
ఈ చూర్ణాన్ని రెండు పూటలా 5 గ్రాముల మొతాదుగా గ్లాసు గోరువెచ్చటి నీటితో భోజనానికి అరగంట ముందు పొద్దు మాపు రోజూ 3 నెలలు సేవిస్తున్న నరాలకు మంచిబలముకలిగి హుషారుగా ఉంటారు
వైద్యుల పర్యవేక్షణలో స్వర్ణభస్మం మున్నగు భస్మాలు కలిపి వాడిన మంచి ఫలితం.