శీర్షాసనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆసనాన్ని నాలుగు కాళ్ళు కలిగిన ఇనుప చట్రంమీద చేతులు పెట్టడానికి అనువైన వెడల్పు భాగం మీద చేతులు వుంచి, శరీర బరువును మోసేందుకు తమ భుజాలను సిద్ధం చేసి నెమ్మదిగా కాళ్ళు పైకి ఎత్తాలి. క్రమక్రమంగా శరీరం తూలకుండా నిలుపుతూ మొత్తం శరీరం తలకిందులుగా నిలపాలి. 
ఈ ఆసనంలో శ్వాసక్రియ మామూలుగా జరపాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి కాసేవు శవాసనం వేయాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ (హైపర్ టెన్షన్) ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు కానీ శీర్షాసనం వేయకూడదు. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు. 

కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశం వుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ తగ్గడం కోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమని యోగా నిపుణులు చెపుతారు.

శవాసనంలో వీలయినంత సేపు ఉండడంకోసం మీ శ్వాసని లెక్క పెట్టడం మొదలు పెట్టి గాలి బయటకు వెళ్ళినప్పుడు పొట్ట లోపలికి వెళుతుంది. అప్పుడు ఒకటి అని లెక్కపెట్టి మళ్ళీ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు రెండు అని లెక్కపెడుతూ 10 వరకు లెక్కపెట్టి మళ్ళీ 10 నుంచి 1 వరకు లెక్కపెడితే చాలా తొందరగా రిలాక్స్ అవుతారని వ్యాయామ నిపుణులు పేర్కొన్నారు. శవాసనం ప్రతిరోజూ 10 నిమిషాలు చేయటం వలన అధిక బీపీ ఉన్నవారిలో అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయని నిపుణులు తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here