పక్షవాతం – వివరణ – ఔషధాలు .
పక్షవాతం అనగా శరీరం నందలి ఏదేని ఒక భాగం చచ్చుబడిపోవడం . సామాన్యముగా పక్షవాతంలో ఒక కాలు , ఒక చెయ్యి కాని లేదా రెండుకాళ్లు గాని చచ్చుబడును . ఈ వ్యాధి రక్తపోటు అధికం అయినప్పుడు మెదడులోని నాడులు చచ్చుబడిపోయి మాటకూడా పడిపోవును . ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది కాని ప్రస్తుతం ఇది మానసిక ఒత్తిడుల వలన నలభై సంవత్సరాల వారికి కూడా వచ్చుచున్నది. ఒకసారి పక్షవాతం వచ్చినచో సరైన చికిత్స తీసుకున్నచో మూడు నుంచి ఆరు నెలల సమయంలో రోగి కోలుకొగలడు .
పక్షవాతం రావడానికి గల కారణాలు –
* రక్తపోటు .
* మానసిక ఒత్తిడి .
* నాడి దౌర్బల్యము .
* అతి సంభోగము .
* అనిద్ర .
* అతి వ్యాయామము . బరువులు ఎత్తుట .
* అతిగా మాట్లాడుట .
* మద్యపానం , ధూమపానం .
పక్షవాతం లక్షణాలు –
* తల తిరగటం .
* కాలు , చెయ్యి తిమ్మిర్లు .
* రక్తపోటు .
* మెడ నరములు లాగడం .
* నిద్రపట్టకపోవడం .
* నడవలేకపోవడం .
ఔషధయోగాలు –
* జాజికాయ నీటితో అరగదీసి చచ్చుబడిన అవయవానికి పట్టువేయవలెను .
* కసవింద చెట్టు రసము నందు వెన్న కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయవలెను .
* వెల్లుల్లి , పసుపు కలిపి నూరి మర్దించవలెను .
* నువ్వులనూనెతో మిరియాల చూర్ణం కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయుచున్న పక్షవాతం తగ్గును.
మరిన్ని యోగాలు మరియు వ్యాధుల చికిత్సలు మరింత వివరంగా నేను రచించిన గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. వాటిని చదవగలరు . పాటించవలసిన ఆహార నియమాలు కూడా వివరణాత్మకంగా గ్రంథముల యందు లభ్యం అగును.
గమనిక –
నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు