పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్ ఎంతో మంచిదంటున్నారు డాక్టర్లు.
సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టప డరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందు లోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసి కంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యా రెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకు న్నట్ల యితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లబి ్థస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇంతే కాక క్యారెట్‌లో విటమిన్ ఃఎః ఉంటుంది. ఃఎః విటమిన్ వల్ల కంటిచూపుకు ఎంతో మేలు కల్గుతుంది. క్యారెట్‌ను అధికంగా తింటే కంటిజబ్బులు కూడా మటుమాయమవు తాయి. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక చెప్పవచ్చునంటు న్నారు డాక్టర్లు. క్యారెట్ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉంటూ కాలిన గాయం బాధ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కూడా కల్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు దోహదపడు తుంది. అంతే కాక కాలిన గాయాల మచ్చలు కూడా క్యారెట్ రసం పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.
ఇక చిన్నారులు ఈ క్యారెట్ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు సేవించినట్లయితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది. క్యారెట్ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి. అలాగే ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
ఇక ఈ క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంత గానో దోహదపడతాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. క్యారెట్‌ను తీసు కోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తే జపర్చడమే కాక, ఆలోచనాశక్తి కూడా పెరిగేలా చేస్తుందంటు న్నారు నిపుణులైన వైద్యులు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తే జంగా ఉండేలా చేస్తుంది. క్రీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానికలాేగా ఉపయోగ పడుతుంది. రక్తహీనతకు కూడా క్యారెట్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యారెట్‌తోపాటు కాస్త తేనెను కలిపి పిల్లలకు ఇచ్చినట్లయితే వారి చర్మం కాంతివంతంగా తయారవు తుంది. దీర్ఘకాలిక రోగాలను సైతం క్యారె ట్‌లోని యాంటీ యాక్సిడెంట్స్ నయం చేస్తాయి. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి.
ఇంకా ఈ క్యారెట్ల జ్యూస్ వల్లా, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తినడం వల్లా నోటి అల్సర్ నివారణ సాధ్య మవుతుంది. క్యారెట్, టవెూటా, బత్తాయి పండ్ల రసాలను సమపాళ్ళలో తీసుకుని రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వాడి నట్లయితే, నోటి అల్సర్‌నున పూర్తిగా నివారించవచ్చు. ఇంతే కాక నిద్రలేమి కి కూడా క్యారెట్ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకనే చిన్నారులకు రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇచ్చి నట్లయితే వారు ఎంతో హాయిగా చక్కగా నిద్రిస్తారు. మంచి ఆహారం, మంచి నిద్ర పిల్లల మేథోవికాసానికి, భౌతిక వికాసా నికి ఎంతో దోహదపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. క్యారెట్ తినడం వల్ల మంచి పోషక విలువలు దేహానికి లభించి, మంచి ఆరోగ్యం చేకూరుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
మరి ఇంత మేలు చేసే, ఇన్ని ఔషధ గుణాలున్న క్యారెట్‌ను అమ్మతో చెప్పి చేయించుకుంటారు కదా బాలలూ!
ఈ రోజు పిల్లలకు క్యారట్ పెట్టాం కదా అని వదిలేయక, క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో క్యారెట్‌ను మీ చిన్నారులకు పెడితే, వారి ఆరోగ్యం పదికాలాలపాటు చక్కగా వర్ధిల్లుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.