తలలో పేలు నివారణ

పేలు తీవ్రస్థాయిలో డ్రై కావటానికి కారణమవుతుంది. అరకప్పు వెనిగర్ లో ఐదు స్పూన్స్ ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఒక షవర్ క్యాప్ ధరించి రెండు గంటలు అయ్యాక మీ జుట్టు కడగడం మరియు దువ్వటం చేయాలి. అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రతి మూడు రోజులకు ఒకసారి రిపీట్ చేయాలి.

వెన్న తల పై చర్మం మీద వెన్న రాస్తే పేలను చంపుతుంది. రాత్రి పడుకోనే సమయంలో తలకు పట్టించి, మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగటం మరియు దువ్వెనతో దువ్వాలి. ఇది తలలో పేలు కోసం మరింత సహజ హోమ్ నివారణలలో ఒకటి.

బేకింగ్ సోడా బేకింగ్ సోడా పేలను తొలగించటంలో సమర్థవంతముగా పనిచేస్తుంది. ఆలివ్ నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీద చర్మంపై రాసి రాత్రిపూట వదిలి వేయాలి. ఉదయం, షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనె ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనె కలపాలి. రాత్రి పడుకోనే సమయంలో ఈ మిశ్రమాన్ని పట్టించి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.

డెట్టాల్ ఇది యాంటి సెప్టిక్ మరియు తలలో పేలు కోసం గొప్పగా పని చేస్తుంది. తల మీద చర్మంపై డెట్టాల్ పట్టించి,ఒక గంట తర్వాత ఆలివ్ ఆయిల్ రాయాలి. రాత్రి పూట అలా వదిలేసి,ఉదయం షాంపూ తో మీ జుట్టును కడగి దువ్వెనతో దువ్వాలి

ఎసెన్షియల్ ఆయిల్ చికిత్స ఎసెన్షియల్ ఆయిల్ కి ఆలివ్ నూనె లేదా ఆల్కహాల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రాత్రి పూట అలా వదిలేసి,మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి దువ్వాలి. లావెండర్ నూనె, వేప నూనె, లవంగం నూనె,యూకలిప్టస్ నూనె, సొంపు నూనె, దాల్చిన చెక్క ఆకు నూనె, ఎరుపు థైమ్ నూనె, పిప్పరమింట్ నూనె మరియు జాజికాయ నూనెలను ఎసెన్షియల్ నూనెలుగా ఉపయోగించవచ్చు.
ట్రీ టీ ఆయిల్ టీ ట్రీ ఎసెన్షియల్ నూనె ఒక సహజ క్రిమి సంహారి మరియు తల పేల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి లేదా ఆలివ్ నూనె తో టీ ట్రీ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ నెత్తి మీద చర్మం అంతటా పట్టించి ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేయాలి. ఒక అరగంట తర్వాత వేడి నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here