రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని స్పిగ్మోమానోమీటరు అంటారు. స్పిగ్మోమానోమీటర్‍ను రక్తపీడన మీటరు, స్పిగ్మోమీటర్ అని కూడా అంటారు. రక్తం ప్రహించేటప్పుడు కలిగే ఒత్తిడిని కొలిచేందుకు పాదరసం లేదా యాంత్రిక ద్రవపీడన మాపకాన్ని ఉపయోగిస్తారు. రక్త ప్రవాహం ఆటంకాలు లేకుండా సాఫీగా జరగడానికి వీలున్న మోచేతికి పైభాగాన ఈ పరికరాన్ని అమర్చి రక్త పీడనాన్ని ఎక్కువగా కొలుస్తారు. మనిషి యొక్క సాధారణ రక్త పీడనం 120/80.